రాయలసీమ సాగునీటి రంగాన్ని సత్వరమే గాడిలో పెట్టండి.
రాయలసీమ సాగునీటి రంగం శిథిలావస్థకు చేరింది. ఈ పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నంద్యాల సమితి కార్యాలయంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…
శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నా, రాయలసీమ ప్రాజెక్టులకు నీరందడం లేదనే విషయాన్ని పౌర సమాజానికి తెలియజేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ రాయలసీమ సాగునీటి సాధన సమితి సెప్టెంబర్ 12న నంద్యాలలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులను స్థితిగతులు స్వయంగా తెలుసుకొనే నేపథ్యంలో, ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు స్థితిగతులు తెలుసుకోవడానికి జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ జిల్లాల పర్యటనకు విచ్చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
2014 – 19 లో టి డి పి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో రాయలసీమకు సాగునీటి రంగానికి 17 శాతం నిధులు ఖర్చు చేసిందని జలవనురుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు హంద్రీ నీవా ప్రాజెక్టు సందర్భంగా 22.9.2024 న ప్రకటించారు. 2019 – 24 లో వైసిపి ప్రభుత్వం కేవలం 6 శాతం నిధులను మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసారని ప్రకటించారు.
వైసిపి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కంటే టిడిపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిధులు అధికంగా కేటాయించినప్పటికీ రాయలసీమ సాగునీటి రంగంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. అందుకు నాలుగు దశాబ్దాలుగా ప్రారంభమైన హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన పందికోన రిజర్వాయర్ దుస్తితిని సవివరంగా వివరించారు. పందికోన రిజర్వాయర్ కు ప్రస్తుతం నీటిని నింపతున్న లెక్కన నిర్ధేశిత నీటిని నింపడానికి 464 రోజులు పడుతుంది. కానీ సంవత్సరంలో ఉన్నది 365 రోజులే. అంతే కాకుండా పంట కాలం కూడ 90 నుండి 120 రోజులు. ఈ వ్యవదిలో రిజర్వాయర్ కు నీరు అందించలేకపోతే వ్యవసాయం తిరోగమన దిశగా ఉంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో మొట్టమొదటిగా ఉన్న రిజర్వాయర్ పరిస్థితే ఇలా ఉంటే ప్రాజెక్టు చివరన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం దుస్తితి గురించి వివరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు
రాయలసీమ సాగునీటి రంగాన్ని తక్షణమే గాడిలో పెట్టాలి
ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం.. ప్రజల దాహార్తిని తీరుస్తాం.. అనే వాగ్ధానాలు రాయలసీమను రత్నాల సీమను చేయలేవు. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకకు లాగా ఉన్న రాయలసీమ సాగునీటి రంగాన్ని తక్షణమే గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం ఉన్న రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం రాయలసీమకు కేటాయించి, రాయలసీమ సాగునీటి రంగంలో పురోగతిని సత్వరమే సాధించడానికి కృషి చెయ్యాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగం అభివృద్ధి చెందడానికి ఈ నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లేదా వేరే ఫథకాల ద్వారా మరియు స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా లేదా ప్రపంచ బ్యాంకు రుణాల ద్వారా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV