రాయలసీమ రైతుల వర ప్రసాధిని రాయలసీమ ప్రాజెక్టులకు ముఖ ద్వారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండు తెలుగు రాష్టాల ఒప్పందల ప్రకారం ప్రభుత్వ జీవో మేరకు శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టానికి చేరితే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులతో పాటు తమిళనాడు రాష్టం లోని చెన్నకి త్రాగునీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే 865 అడుగులకు నీరు చేరినప్పటికి జలవనరుల శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వాధినేతల ఆదేశాలకోసం వేచి చూస్తున్నారు.
ఇక్కడచూస్తే తొలకరులకు మురిసిన రైతన్నలు కాస్త ముందుగానే పంటపొలాల్లో విత్తనాలు వేశారు. ఉన్నట్లుండి వరణుడు హఠాత్తుగా ముఖం చాటేయడంతో 15నుంచి 20రోజుల వయసున్న పంటలు తలలు నేలకువాల్చి తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. శ్రీశైల జలాశయంలో అవసరమైనమేరకు నీరు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకో పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది.
ప్రస్తుతం పోతిరెడ్డిపాడునుంచి నీటివిడుదల జరిగితే 44వేల క్యూసెక్కుల పరిమాణంగల నీటిని తీసుకుపోగల సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రధాన కుడి కాలువద్వారా భానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కు నీరు చేరుకుంటుంది. అక్కడ నుంచి తూర్పుగా ప్రధాన తెలుగుగంగ కాలువగుండా ప్రవహించి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుకుంటుంది. 16.5 టిఎంసిల నీటినిలువ సామర్థ్యం ఉన్న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తెలుగంగ కాల్వగుండా కృష్ణమ్మ జలాలు వడివడిగా కడప జిల్లాలోని బ్రహ్మసాగర్ ప్రాజెక్టు చేరుకుంటాయి. ఆపై నెల్లూరుజిల్లాకు సాగునీరు ఆతర్వాత తమిళనాడులోని హుండీ రిజర్వాయర్ ద్వారా చెన్నైదాహార్తిని తీర్చనున్నాయి.
బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి దక్షిణంగా
అలాగే బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి దక్షిణంగా వెళ్లే ఎస్ఆర్బిసి కాలువ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ ఆతర్వాత అవుకు రిజర్వాయర్లు నింపనున్నాయి. అవుకు రిజర్వాయర్ నుంచి నేరుగా గండికోటకు GNSS గాలేరునగరి సుజల స్రవంతి ద్వారా చేరుకుంటాయి. మరోమార్గంలో ఎస్ఆర్బిసి ద్వారా కొనసాగి బనగానపల్లె, కోవెలకుంట్ల,ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు తదితర దుర్భిక్ష ప్రాంతాలను కృష్ణా జలాలు సుసంపన్నం చేయనున్నాయి.
మొత్తానికి రాయలసీమ జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టులతోపాటు నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు రిజర్వాయర్లతోపాటు చెన్నైకి సాగు, త్రాగునీరు అందిస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లుఎత్తి వెంటనే నీటి విడుదల చేయాలని రాయలసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు.. రాయలసీమ వనరులు రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో 40%, అలాగే జనాభాలో 30% కలిగి ఉన్నాయి. రాయలసీమకు ప్రకృతి అన్నివనరులు సమకూర్చింది. అటవీ సంపదతోపాటు కనిజ సంపదతో అన్నిరకాల పంటలు పండే సారవంతమైన భూములు వున్నాయి.
Read More నేర నియంత్రణపై కర్నూలు SP విక్రాంత్ పాటిల్
దీనికి తోడు అనువైన వాతావరణంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు కావలసిన విత్తనోత్పత్తి చేయగల మానవ వనరులు (రైతులు, రైతు కూలీలు) గలగల పొంగిపొర్లే కృష్ణ( ఉపనదులు తుంగభద్ర,వేదవతి, హంద్రీ, పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, జయ మంగలి, సగిలేరు,కుందూ నదులు రాయలసీమ సొంతం.
దక్షిణ భారతదేశంలో నదుల ప్రవాహం నది పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. అంటే వర్షాకాలంలోనే ప్రధానంగా నదిలో నీటిప్రవాహాలు ఉంటాయి.
వర్షాకాలంలో మాత్రం లభించే అమూల్యమైన నీటిని రభి మరియు ఖరీఫ్ కాలలో పంట పొలాల వైపు మళ్ళించు కోవడానికి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి నీటి నిలువ ఉంచుతారు.
తుంగభద్ర నదిపై హంపి వద్ద తుంగభద్ర డ్యాం, శ్రీశైలం వద్ద నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్, కృష్ణా నదిపై నాగార్జునసాగర్ వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి.
జూన్, జూలై మాసాల్లో వర్షాలు ఆలస్యమైతే లేక ఎండాకాలంలో నీటి కొరుతను అధిగ మించడానికి ఎక్కువ నీటిని నిలు వ చేయుటకు సాగునీటి ప్రాజెక్టులతో పాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అవసరం. వీటివల్ల నీటిని గరిష్టంగా అరికట్టవచ్చు. సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలను సక్రమంగా పొందటానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం తప్పక చేపట్టాలి..
కృష్ణ జలాలు మొట్టమొదటిగా రాయలసీమలో
కృష్ణ జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా రాయలసీమలో ప్రవేశిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం నీటి వనరుల వినియోగంలో నిరంతరం వివక్షకు గురికాకతప్పడంలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్న సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తూ అనేక అభ్యంతరాలను బచావత్ ట్రిబ్యూనల్ ముందు ఉంచాయి. ఈ అభ్యంతరాలను త్రోసిపుచ్చుతూ రెండు కీలకమైన విషయలను బచావత్ ట్రిబ్యూనల్ పేర్కొంది..
శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే సమయంలో సాంకేతిక నిపుణులు రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు ప్రాజెక్టు డిజైన్ చేశారు. రిజర్వాయర్ కనీసం నీటిమట్టం 854 అడుగులు ఉంటేనే భవిష్యత్తులో రాయలసీమకు నిరందించే అవకాశం ఉంటుందని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల శాఖ ఈ డిజైన్ ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులకంటే తక్కువ నీటిమట్టం ఉంటే రాయలసీమకు నిరందించడానికి చాలాదూరం నదిలో కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులతో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
కృష్ణా జలాను శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమకు గ్రావిటితో పొందటానికి సిద్దేశ్వరం మరియు సంగమేశ్వరంకు ఎగువన ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏకైక మార్గం. శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తిస్థాయిలో 885 అడుగులలో నీరు ఉంటే 44వేల క్యూసెక్కులు నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవచ్చు.
శ్రీశైలం జలాశయంలో 854అడుగుల వరకు నీరుంటే 8వేల క్యూసెక్కుల నీటిని పి.హెచ్.ఆర్ ద్వారా పొందే అవకాశం ఉంది. రిజర్వాయర్ నీటి మట్టం 841 అడుగుల దిగువకు తగ్గయిటీ PHR ద్వారా నీరు తీసుకునే అవకాశం లేదు.