శ్రీశైలం వెళ్లే భక్తులకు పోలీసుల హెచ్చరిక

Police warning to Srisailam devotees

Police warning to Srisailam devotees

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు శ్రీశైలం వెళ్లే భక్తులకు (వాహన దారులకు) కొన్ని హెచ్చ రికలు, సూచనలు జారీ చేశారు.

శ్రీశైల మహా క్షేత్రం కార్తీకమాసం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గతవారం రామయ్య టర్నింగ్ నుండి సాక్షి గణపతి వరకు

దాదాపుగా 50 నుండి 60 వాహనాలు సాంకేతిక కారణాల ( వాహనాల బ్రేక్ డౌన్) వల్ల వాహనాలు నిలిచి పోవడం జరిగిందని, అన్నారు

శనివారం, ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువలన శ్రీశైలం వెళ్ళే భక్తులు (వాహన దారులు)

తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ లోని వివిద ప్రాంతాల నుండి వచ్చే భక్తులు (వాహన దారులు) తమ ఫోర్ వీలర్స్ వాహనంతో పాటు తప్పనిసరిగా

డ్రైవింగ్ పై అనుభవం గల డ్రైవర్ ను తమ వెంట తీసుకుని వెళ్లాలని కోరారు, మరియు ఘాట్ రోడ్డు లో వాహనాలను ఓవర్ టేక్ చెయ్యరాదు అని హెచ్చరించారు

ట్రాఫిక్ నిభందన లను (రోడ్డు భద్రతా నిభందనలు) తప్పనిసరిగా పాటించాలి కోరారు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

మోటార్ సైకల్ పై వెళ్ళే వాహన దారులు తప్ప నిసరిగా హెల్మెట్ దరించాలి లేదంటే ఫైన్లు వేయడం జరుగుతుందని తెలిపారు

.మరియు వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలుప రాదని వివరించారు

ఇతర భక్తుల కు (వాహన దారులకు ) అసౌకర్యం కలిగించెల వాహనాలు పార్కింగ్ చేయ రాదని, పోలీసు వారు సూచించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు నిలుపాలని కోరారు

సాక్షి గణ పతి వద్దకు కాలి నడకన వెళ్ళి దర్శనం చేసుకోవాలి కానీ వాహనాలు నిలుపు కొని దర్శనం చేయ రాదు.

వాహనాలు నిలుపడం వలన ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది అన్నారు.

కావున భక్తులు (వాహన దారులు) గమ నించి పోలీసు వారికి సహకరించ గలరు. పై నిబంధనలు పాటించ ని వాహన దారుల పై

కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.

                          శ్రీశైల మహా క్షేత్రం కార్తీకమాసం  భక్తుల రద్దీని(వాహనదారుల) దృష్టి లో ఉంచుకొని భక్తుల కు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు ప్రస్తుతం 170 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. వారు  ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో వాహనాల పార్కింగ్ ల వద్ద  విధులు నిర్వర్తించడంతో పాటు , ప్రత్యేక విధులపై సిబ్బందిని కేటాయించారు. దీనికి అను గుణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని నియమించారు.ఈ వారం చివరి సోమవారం కావడం వలన భక్తుల రద్దీని దృష్ఠి లో ఉంచుకొని అదనంగా 100 సిబ్బందిని

నియమించారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించ కుండా విధులు నిర్వ హించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసమంతా అభిషేకాలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈనెల 14 నుంచి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కార్తీక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు

శని, ఆది, సోమవారాల్లో మల్లికార్జునస్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు నాలుగు విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్పర్శ దర్శనం టిక్కెట్లను దేవస్థానం మొబైల్‌ యాప్‌ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు.

శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తీక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top