- గ్రామసభలు (పల్లె నిద్ర )కార్యక్రమాల ద్వారా నేర నియంత్రణకు చర్యలు.
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు ఆత్మకూరు సబ్ డివిజన్ లలోని శివపురం గ్రామంలో ఆత్మకూరు DSP రామంజి నాయక్ గారు , ఇన్స్పెక్టర్ M.సురేశ్ కుమార్ రెడ్డి గారి ఆద్వర్యంలో గ్రామసభలు (పల్లె నిద్ర )కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మరియు సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు,మహిళలపై జరిగే నేరాలు, నేరాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు మొదలగు వాటిపై QRT టీం మరియు వారి సిబ్బంది సహాయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు అదికారులు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు మహిళలపై మరియు చిన్న పిల్లలపై నేరాలు జరుగుచున్న క్రమంలో వాటి భారిన పడకుండా ఉండేందుకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు.
ఎవరైనా సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుంటే వెను వెంటనే 1930కి సమాచారం అందించిన యెడల బాధితులకు సహాయం అందించబడుతుందని తెలియజేశారు. అత్యాశకు వెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో పడవద్దని , లోన్ యాప్, బిట్ కాయిన్స్, గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మొదలగు వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు మంచివి కాదని ఎదుటివారిని వద్ద నుండి వచ్చే లింకులను గాని మెసేజ్లను గాని ఓపెన్ చేయరాదని తెలియజేశారు
మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే 112 నంబర్ కు కాల్ చేసి మీ వివరాలు తెలియజేసిన యెడల వెంటనే పోలీసులు మీకు రక్షణగా ఉంటారని తెలియజేశారు.
Alaso Read రోడ్డు ప్రమాదాలపై..DSP రామంజి నాయక్
వాహనాలు నడిపే వ్యక్తులు (Drivers ) ప్రభుత్వం వారు జారీచేసిన డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయరాదు. అంతేకాక మీరు నడిపే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్(R.C) ఇన్సూరెన్స్ మొదలైన పత్రాలు ఉంచుకోవాలి.వీలైతే మీ గుర్తింపు కార్డులు కూడా మీ వెంట ఉంచుకోవడం మంచిది.మద్యం సేవించి వాహనాలు నడపరాడు.మద్యం మనషి మెదడను తన అధీనంలోకి తీసుకుంటుంది. తాగినప్పుడు వాహనంపై కంట్రోల్ ఉండదు. మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరమే కాదు చట్టరీత్యా నేరం కూడా. మద్యం సేవించి డ్రైవ్ చేయటం వలన డ్రైవర్లు తమ ప్రాణాలను రిస్కులో పెట్టడమే కాకుండా అవతలి వాళ్ల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టిన వారు అవుతారు. కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లోను మద్యం సేవించి వాహనం నడపరాదు.మరియు మైనర్ లకు (చిన్న పిల్లలకు) వాహనాలు డ్రైవింగ్ చేసే అవకాశం ఇవ్వరాదు.
గ్రామాల్లో అందరూ ఐకమత్యంతో మెలాగాలి
నేర నియంత్రణ కొరకు పోలీసు వారు తీసుకున్నటు వంటి చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రజల యొక్క సహకారం ఎంతో అవసరమని, గ్రామాలలో నేర నియంత్రణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక్క సీసీ కెమెరా ఉంటే నేర దర్యాప్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు తెలియ చేసినారు.
గ్రామాల్లో అందరూ ఐకమత్యంతో ఉంటూ ఎలాంటి గొడవలు అల్లర్లకు వెళ్లకూడదని ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తక్షణం మీకు రక్షణ కల్పిస్తారు. కావున ప్రజలందరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే వారి వివరాలను పోలీస్ అదికారులకు తెలియచేసిన వారి యొక్క వివరాలను సమగ్రంగా తెలుసుకోవడానికి నేర నియంత్రణకు ఉపయోగపడుతుందని, ప్రజలకు పోలీసు అదికారులు తెలియజేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల
#APDGP #APPolice #inspiring #villagepeople #PoliceAwareness #digkurnool