ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వ్యాస్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.
.21.10.2025 తేదిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను పురస్కరించుకొని మంగళగిరి 6వ ఎ.పి.ఎస్.పి. బెటాలియన్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఇతర ఉన్నతాదికారులతో కలిసి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతరం నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, డి.సి.పి.లు శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు, ఇతర పోలీసు అధికారులతో కలిసి విజయవాడ ఇందిరాగాంధి మునిసిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ నేపధ్యంలో పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ…….. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేమని, సీనియర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించి అమరులైన కె.ఎస్. వ్యాస్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవడం జరుగుతుందని, మావోయిస్టులను అణచివేయటంలో వ్యాస్ కీలకపాత్ర పోషించారని తెలియజేశారు. మన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసు, నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను చేస్తుంటారు, వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో వారి జీవితాలను అంకితం చేసి అమరులైన ప్రతి ఒక్కరికీ ఈ రోజున నివాళులర్పించడం జరిగిందని, పోలీసు విధి నిర్వహణలో అమరులైన ప్రతి ఒక్కరినీ స్మరించుకోవడం ఒక భాద్యత అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, డి.సి.పి.లు లు శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గున్నారు.











