రైతు రక్షణ కాలినడక యాత్ర-ఏపీ రైతు సంఘం

wwwpolticalhuntercom.jpg

మద్దికేర నుండి పత్తికొండకు చేరుకున్న రైతు రక్షణ కాలినడక యాత్ర

అధిక వర్షాలు నకిలీ విత్తనాలు మిర్చి వేరుశనగ టమోటా పంటల వల్ల నష్టపోయిన రైతుల కు నష్టపరిహారం ఇవ్వాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య

నకిలీ విత్తనాల వల్ల అధిక వర్షాల వల్ల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిన వెంకటరాముడు

సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు రక్షణ కాలినడక యాత్ర మద్దికేర నుండి శుక్రవారం ప్రారంభమై పత్తికొండకు చేరుకుంది పత్తికొండ పట్టణం స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర రైతు రక్షణ కాలినడక యాత్ర సభ నిర్వహించారు ఈ సభకి సిపిఐ మండల కార్యదర్శి రాజాసాబ్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిన వెంకటరాముడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ…కర్నూలు జిల్లాలో ఆదోని ఆస్పరి దేవనకొండ కోడుమూరు మద్దికేర తుగ్గలి పత్తికొండ దేవనకొండ మంత్రాలయం ఎమ్మిగనూరు గోనెగుండ్ల కటారకొండ క్రిష్ణగిరి వెల్దుర్తి లద్దగిరి వివిధ మండలాల గ్రామాల రైతులు అధిక వర్షాల వల్ల నకిలీ విత్తనాల వల్ల ఉల్లి మిర్చి వేరుశనగ టమోటా పంటలు అమాంతం నష్టం వాటిల్లిందని అన్నారు.

అందుచేత రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతులు ఆశాజనకంగా పంటలు సాగు చేశారు ప్రారంభంలో మంచి వర్షాలు అనుకూలమైన సమయంలో వచ్చాయి పత్తి ధర బాగా ఉందని పత్తిని ఏడు లక్షలు ఎకరాల్లో సాగు చేశారు కానీ నమ్ముకున్న పత్తి రైతులను నట్టేటమచింది అని వారన్నారు అలాగే ఎడతెరిపిలేని వర్షాల వల్ల దాదాపుగా 20 రోజులు వరుసగా వర్షాలు వచ్చాయి అలాగే నేనేమి తక్కువ కాదన్నట్లుగా గులాబీ పురుగు ఖాయ తల్చుపురుగు కుళ్ళు తెగులు వచ్చి పత్తి రైతును నిందమూంచేశాయి దీనికి తోడు నకిలీ విత్తనాలు మధ్య దళారులు రైతుకు అంత గట్టి కనీసం గిట్టుబాటు స్థాయిలో కూడా రాణి విధంగా ఉన్నటువంటి విత్తనాలు వల్ల రైతులు నష్టపోయారు మకిలి విత్తనాలను అంటగట్టిన వ్యాపారులు మాత్రం బాగుపడ్డారని వారన్నారు.

అలాగే అధిక వర్షాల వల్ల ఉల్లి పంట పొలాల్లోనే మునిగిపోయింది అంతేకాకుండా మిరప ఎకరాకు 80000 వరకు పెట్టుబడి ఖర్చు అయ్యాయి పూత దశలో తెగుళ్లు వచ్చి పూత ర్యాలిపోయింది వేరుసెనగ ఆముదము ఘోరంగా దెబ్బ తిన్నాయి టమోటా కిలాకు ఒక్క రూపాయి అమ్మ లేక బంగారం లాంటి టమోటా రోడ్లపై పారేయడం జరిగింది అని వారన్నారు అలాగే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అలాగే పత్తి వేరుశనగ ఆముదము పంటలకు ఎకరాకు 40 వేల రూపాయలు ఇవ్వాలని అంతేకాకుండా ఉల్లి మిరప పంటలకు 60 వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని వారు అన్నారు నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయబద్ధమైన పంట నష్టపరమారం ఇవ్వాలని హంద్రీనీవాకు కాలువలకు మార్చి చివరి వరకు నీళ్లు వదలాలని పంటల భీమా పథకాన్ని పూర్తిస్థాయిలో వర్తింపచేయాలని ఖరీఫ్ సీజన్లో రైతులకు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో వలసలు ఆపడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి రోజుకు 500 రూపాయలు కూలి ఇవ్వాలని అన్నారు. నకిలీ విత్తనాల అమ్మిన కంపెనీలపై చెస్తులను రద్దుచేసి తక్షణమే వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కారన్న భీమ లింగప్ప నబి రసూల్ సుల్తాన్ సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి వీరశేఖర్ తెలుగుదేశం పార్టీ తిరుపాల్ పుచ్చరప్ప తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top