ఒరేయ్ మీరు మారరా??
నిన్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవడో పాకిస్తాన్ ఓపెనర్ హాఫ్ సెంచరీ చేయగానే ఆనందంతో వాడి బ్యాట్ ను మిషన్ గన్ లా పెట్టీ పేల్చినట్లు అభివాదం చేశాట్ట…..
దీని ద్వారా ప్రపంచానికి క్రీడా లోకానికి ఏమి సందేశం ఇస్తున్నావ్ రా వెధవ…..
టాస్ సమయంలో కానీ మ్యాచ్ అయ్యాక కానీ మీకు మా ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్ ఇవడానికి కూడా ఇష్టపడటం లేదు…దీనికి మీకు బాధ అవమానం కూడా లేదారా?
ప్రపంచం అంతా మీ వైపు దోషి గా చూస్తున్నా మళ్ళీ గన్ పేల్చేలా అభివాదం చేశావంటే నువ్వు నీ కల్చర్ ఎలాంటి అనేది తెలుసుకోవాలి…
ఫహల్గం లో కిరాయి మనుషులని పంపి మా దేశం మీద చేసిన ఉగ్రదాడిని మేము తిప్పి కొట్టి మీ దేశంలోకి మరీ చొరబడి మీ తీవ్రవాద శిబిరాలు మీ ఎయిర్ బేస్ లు అన్నీ ధ్వంసం చేశాక కూడా ఆ ఆలోచనా విధానం లో మార్పు రాలేదు ఏమిటిరా……
అవును లే అంత త్వరగా ఎందుకు వస్తుంది??? నిన్న నీ విధానాలని సపోర్ట్ చేసే వాళ్ళు మా దేశంలో కొద్ది శాతం ఉన్నారు కదా….వాళ్లకు లేని బుద్ధి జ్ఞానం నీకు మాత్రం ఎక్కడ నుండి వస్తుంది….వాళ్ళది నీది సేమ్…
అయినా నిన్ను అని ఏమి వస్తుంది ?
నీతో మ్యాచ్ షెడ్యూల్ చేసిన మా BCCI ది,, అంతర్జాతీయ నిబంధనలు అని BCCI కి సపోర్ట్ చేసిన మా ప్రభుత్వానిది తప్పు……
కనీసం ఇప్పటికైనా అలాంటి వెధవలతో మ్యాచ్ ల కేంద్ర ప్రభుత్వం నిషేధం పెట్టాలని సగటు భారతీయుడి గా మనవి….