టిడిపి 100 రోజుల పాలనపై మంత్రి ఫరూక్

OnTDP's 100days rule MinisterFarooq

OnTDP's 100days rule MinisterFarooq

  • మంచి పరిపాలన దక్షకుడు చంద్రబాబు.
  • అభివృద్ధి ,సంక్షేమమే చంద్రబాబు కు రెండు కళ్లులాంటివి
  • 100 రోజుల పాలనలోనే రాష్ట్రంలో కొత్త పురోగతి
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
  • మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి , జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి ఘన స్వాగతం పలికిన అయ్యలూరు గ్రామ ప్రజలు

మంచి పరిపాలన దక్షకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కొనియాడారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఈ రాష్ట్రం సర్వనాశనమే అని అందుకు గత ఐదేళ్ల పాలనే ఇందుకు నిదర్శనం అన్నారు. చంద్రబాబు తోనే ఆంద్రప్రదేశ్ అభివృద్ది అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల నియోజకవర్గ అయ్యలూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు పాల్గొన్నారు. ముందుగా మంత్రి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య టపాసులు కాల్చి పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికి నీరాజనాలు పలికారు.

అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్రామాలకు అభివృద్ధిలో నూతన పురోగతి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వయంగా వరద బాధితులకు అండగా నిలబడి ఒక తండ్రిలా ప్రజల్ని కాపాడారని గుర్తు చేశారు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

గత ఐదేళ్లలో జరిగిన విధ్వంస పాలన తో రాష్ట్రం ఆర్థికంగా బాగా దివాలా తీసిందన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఆపద్బాంధవుడిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వంద రోజులు దిగ్విజయంగా పాలన సాగించారని గుర్తు చేశారు .గతఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో తూచా తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు . గత వైసీపీ పాలనలో రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రన్న ప్రభుత్వం అని రైతుల కళ్లల్లో కన్నీళ్లు రాకుండా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నంత వరకు రాష్ట్రంలో ఆదర్శ పాలన కొనసాగుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఏపి :- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తయారుకావడం ఖాయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు అన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచి ఎంతో మానవత్వంతో ఆదుకునేందుకు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో (100 రోజుల్లో) ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు . అలాగే అక్కడికి వినతులతో వచ్చిన ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో మల్లికార్జున రెడ్డి , నంద్యాల ఎమ్మార్వో ప్రియదర్శిని , ఎంపీడీవో సుగుణ శ్రీ , అయ్యలూరు టిడిపి గ్రామ అధ్యక్షులు త్రిలింగేశ్వర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ ఓబులేస్ , మహమ్మద్ అయుబ్ , శ్రీనివాసులు , జిలాన్ , కరీం , మనోహర్ రెడ్డి , వర్మయ్య , కాజా , టైలర్ రషీద్ , నాగరాజు బూత్ కన్వీనర్లు అజీమ్ , హబీబుల్లా , ఫరూక్ , శ్రీకాంత్ , మహబూబ్ బాషా , నూర్ , హుస్సేన్ భాష ,రసూల్ , రాము , భాష , టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు మరియు అయ్యలూరు గ్రామ టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top