శ్రీశైలం నిర్వాసితుల జీవితాల్లో తొలగని చీకట్లు

Non-implementation GO no.98

Non-implementation GO no.98

శ్రీశైలం నిర్వాసితుల జీవితాల్లో తొలగని చీకట్లు

మూడున్నర దశబ్దాలుగా అమలు కాని జీ ఓ no.98

శ్రీశైలం ప్రాజెక్ట్ 1963 లో మొదలు పెట్టి 1980 లో పూర్తి చేశారు.

ఉమ్మడి రాష్ట్రం లెక్కలు పక్కన బెడితే మా కర్నూల్ జిల్లా లో 50 గ్రామాల్లో మొత్తం 54807 ఎకరాలు ముంపుకు గురయ్యాయి.

నామ మాత్రం పరిహారం గా ఎకరాకు రు 2000 చొప్పున మాత్రమే చెల్లించారు. భూమికి భూమి, ఇంటికి ఇల్లు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక అధికారులు, పోలీసులు ఊరూర దండోరా వేసి బలవంతంగా ఖాళీ చేయించారు.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

ఈ క్రమంలో బుల్ డోజర్లు పెట్టి ఇళ్లను కూల్చి వేశారు. దాదాపు 14 వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు. న్యాయం కోసం బాదితులు ఎన్నో పోరాటాలు చేశారు.

నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో 1986 లో అప్పటి ముఖ్యమంత్రి కీ శే. ఎన్టీ రామారావ్ గారి హయాంలో ఇరిగేషన్ శాఖ జీ ఓ no.98 ఇచ్చింది.

జీవో ప్రకారం వారి అర్హత మేరకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. అంటే దాదాపు 14000 ఉద్యోగాలు ఇవ్వాలి. అయినా మరో పాతికెళ్ళు గడిచినా ఈ జీ ఓ. అమలుకు నోచుకోలేదు.

జీ ఓ విడుదల అయిన 1986 నుంచి 2000 సంవత్సరం వరకు 1609 మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకొని వెళ్లినా లెక్క చెయ్యలేదు. కొందరు మాత్రమే కోర్ట్ కు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

2011 లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జూపాడు బంగ్లా పర్యటన కు వచ్చినప్పుడు బాదితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం కొత్తగా GO 735 ఇచ్చింది. ఈ జీ ఓ ప్రకారం ఒక కమిటీ వేసి జాబ్స్ కు దరఖాస్తు చేసేందుకు 2000 సంవత్సరం వరకు కటాఫ్ డేట్ పెట్టారు.

దీనిపై కమిటీ వేసి 965 మందికి మాత్రమే అప్రూవ్ చేశారు .

మూడున్నర దశబ్దాలుగా అమలు కాని జీ ఓ no.98

వీరిలో కేవలం 130 మందికి మాత్రమే రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారిని ఔట్ సౌర్చింగ్ కింద లస్కర్లుగా తీసుకున్నారు.

వారికి 960 రు తో స్టార్ట్ చేసి ప్రస్తుతం 20000 మాత్రమే నెల జీతం ఇస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసి చాలామంది చనిపోయారు.

మిగిలిన వారినైనా రెగ్యులర్ చేసి వారి జీవితాలు ఆదుకోవాలిచేశారు. వాళ్ళు పాతికేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

జీఓ ప్రకారం 14000 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉండగా కేవలం 965 మందికి మాత్రమే, అది కూడా లస్కర్ వంటి చిన్న ఉద్యోగాలు ఇవ్వడం వల్ల

ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది.అలాగే దాదాపు 12 కోట్లు రూపాయలు పరిహారం ఇప్పటికి పెండింగ్ లో ఉంది. ఈ రెండు ప్రధాన అంశాలపై

నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్ గారు కూడా పలుమార్లు ఉన్నతాధికారులను కలిశారు. ఎన్నోసార్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ గారికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు.

శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 1670 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.దీని వల్ల మొత్తం రెండు రాష్ట్రాలకు వెలుగు వస్తోంది.

కానీ నిర్వాసితుల కుటుంబాలు మాత్రం నేటికీ చీకట్లో మగ్గిపోతున్నాయి. దయచేసి ఈ సమస్యపై దృష్టి పెట్టి తక్షణమే పరిష్కరించి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి.

అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ముఖ్యం గా ఔట్ సోర్సింగ్ పై చాలీ చాలని జీతానికి పని చేస్తున్న లస్కర్లను రెగ్యులర్ చెయ్యాలి.

#srisailamProject #srisailamdam #go98 #GoNo-98

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top