నంద్యాల జిల్లా, ఆత్మకూరు (మం) వెంకటాపురం గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది.
గ్రామంలోని ఊర్దూ స్కూలు సమీపంలో వున్న వేప చెట్టుకు పాలు కారుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది
ఇది గమనించిన కొందరు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో.. పెద్ద ఎత్తున ఆ వేపచెట్టు వద్దకు చేరుకుని వేప చెట్టులో నుంచి స్వయంగా వస్తున్న పాలని ముందు కనులారా వీక్షించారు.
వేపచెట్టు అంటేనే అమ్మవారిగా భావించే పల్లెటూరి ప్రజలు ఇక ఆ వేప చెట్టుకు పూజలు చేయడం ప్రారంభించారు.
ఇలా 24 గంటలు గడుస్తున్నా పాలు కారడం ఆగకపోవడంతో ఇది ముమ్మాటికి ఆ అమ్మవారు అనుగ్రహంగా బావించి..పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ వింత ఘటనను చూడటాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపాలుగా వేపచెట్టు వద్దకు చేరుకుని వేప చెట్టుకు , పసుపు కుంకుమ సమర్పించి ..టెంకాయ పండ్లు నైవేద్యాలుగా సమర్పించి పూజలు చేయడం ప్రారంభించారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
పల్లెటూర్ల లో అమ్మవారిని కొలుస్తున్న బక్తులు వేపచెట్టును నరకడం కానీ లేదా.. ఆ వేప ఎండు పుల్లలను గాని వంట చెరుకుగా ఉపయోగించరు. అంత పవిత్రంగా వేప చెట్లను పూజిస్తారు , గౌరవిస్తారు.
ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో..పలువురు ఈ వింతను కనులారా చూసేందుకు వెంక టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు.
అందరు వేప చెట్టు వద్దకు రావడం వేప చెట్టు నుంచి పాలు ఏ విధంగా కారుతున్నాయో..నని వీక్షించడం ..
ఏదేమైనా ఇది అమ్మవారి అనుగ్రహం మన గ్రామానికి అంటూ.. నమస్కరించి పూజలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిజానికి వేప చెట్టుకి పాలు కారడం అనేది తరచూ.. ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి..
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయి అన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామల ప్రజలు వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చి..
వేపచెట్టు ఎల్లమ్మ దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. నాగులచవితి ముందర వేప చెట్టుకు పాలు కారడం శుభసూచకమని మహిళలు చెబుతున్నారు.
అయితే నిపుణులు మాత్రం వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు.
ఇది అసాధారణమేమీ కాదంటున్నారు. వేప చెట్టు బాగా చావ పెరిగిన తర్వాత ఎక్కువైన నీటిని కణాల్లో స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా వస్తాయి.
వెదర్‌లో తేమ శాతం పెరిగినప్పుడు, కొమ్మల్లోని ఈ తొర్రలు బలహీనపడి పగుళ్లు కనిపిస్తాయి. ఆ కారణం చేత.. చెట్టు నుంచి పాల లాంటి ద్రవం బయటకు వస్తుంది. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందట.
వేపచెట్టు అన్నది తమ ఇలవేల్పు
అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలు మహిళలు మాత్రం వేపచెట్టు అన్నది తమ ఇలవేల్పు అని… ఎల్లమ్మ తల్లిగా భావిస్తామని.. వేప చెట్టుకు పాలు కారడం ఆ తల్లి ప్రసాదంగా భావిస్తామని చెబుతున్నారు.
ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి… పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు.