భారతదేశంలో ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్నాయి.జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.
వారు ఆత్మకూరు సబ్ స్టేషన్ నుండి, నంద్యాల టర్నింగ్, గౌడ్ సెంటర్, పాత బస్టాండ్ , ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా ర్యాలీ నిర్వహించి. తిరిగి గౌడ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి, ఇంధన పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఇంధన పొదుపు ప్రాముఖ్యత, ఇంధన పొదుపు వల్ల కలిగే ప్రయోజనాలను, ప్లకార్డులు పట్టుకొని, ర్యాలీ సమయంలో ప్రజలకు వినపడేలా విద్యుత్ ఉద్యోగులు స్లోగన్స్ ఇచ్చారు.
ఇంధన పొదుపు వినియోగాన్ని తగ్గించడం వంటి ప్రధాన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వారోత్సవాల లక్ష్యమని అన్నారు. అనంతరం EE , DE లు మాట్లాడుతూ.. విద్యుత్ పొదుపు అనేది ఒక బాధ్యతగా చూడాలన్నారు. విద్యుత్ పొదుపు పాటించడం ద్వారా మనం సమాజానికి ఎంతో మేలు చేసినవారమౌతామన్నారు.
అవసరం మేరకు లైట్లు, ఫ్యాన్లు వినియోగించాలని, ఎల్ ఈడి లైట్లను ఫై వ్ స్టార్, రేటింగ్ ఉన్న విద్యుత్ వస్తువులు వాడటం ద్వారా పొదుపు చేయవచ్చునన్నారు. పొదుపు చేయడం సామాజిక బాధ్యతగా చూడాలని, వివరించారు. అనంతరం అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.., ఆత్మకూరు సబ్ డివిజన్ లోని అన్ని మండలాల విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read more https://youtu.be/8jg7F_sKlAw?si=RH0OwBMI9Gf1BROw
Read more https://politicalhunter.com/prashanth-who-donated-his-organs/











