- 175 క్లిష్టమైన పజిల్స్ 11.59 నిమిషాల్లో పూర్తి
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్
- భారత చెస్ క్రీడాకారులే అతనికి ప్రేరణ: లోకేశ్
- గర్వపడుతున్నా లిటిల్ గ్రాండ్ మాస్టర్: సీఎం
AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు.. నారా దేవాన్స్ చెస్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొమ్మిదేళ్ల దేవాన్. చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్ ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 50 సెకన్లలోనే పూర్తిచేసి ‘ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వ ర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్స్ లో చోటు దక్కిం చుకున్నాడు.
ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఈ పోటీ నిర్వహించగా… ఆదివారం లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందింది. కాగా.. ఇటీవల దేవాన్ చెస్ లో మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తిచే శాడు. 9 చెస్ బోర్డులను కేవలం ఐదు నిమిషాల్లో అమర్చాడు. చిన్న వయసులోనే తనయుడు సాధించిన విజయంపై లోకేశ్ స్పందించారు. దేవాన్స్ లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత చెస్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శనల నుంచి దేవాన్స్ ప్రేరణ పొందాడని అన్నారు. దేవాన్స్ కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.
వెల్డన్ .. దేవాన్స్ : చంద్రబాబు
దేవాన్స్ ప్రదర్శనపై తాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ‘వెల్ద న్ నారా దేవాన్’ అంటూ ‘ఏక్స్లో’ ట్వీట్ చేశారు. ‘ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్స్ కు నా అభినందనలు. దీని కోసం కొన్ని నెలలుగా ఎంతో శ్రద్ధతో కష్టపడ్డావు. నిన్ను చూసి గర్వపడుతున్నా లిటిల్ గ్రాండ్ మాస్టర్’ అని ట్వీట్ చేశారు. మంత్రులు కె.అచ్చె న్నాయుడు, రాంప్రసాదొడ్డి, కె. పార్థసారథి కూడా దేవాన్స్ కు అభినందనలు తెలిపారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా తనయుడి ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.