రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు , ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. విద్యార్థినిలకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పలు సూచనలు ఇచ్చారు.
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది , మరియు నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో.. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పిజి కళాశాల నందు ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల మరియు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై మరియు చిన్న పిల్లలపై జరిగే నేరాల గురించి అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.
సైబర్ నేరాలపై ఉదాహరణగా వివరిస్తూ ప్రస్తుత ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఫేక్ లోన్ యాప్ ల ద్వారా, సామాజిక మాధ్యమాలలో లింక్ లను పంపి ఇన్వెస్ట్మెంట్ చేయాలని నమ్మించడం , ఆన్లైన్లో జాబ్స్ ద్వారా, వర్క్ ఫ్రం హోం అంటూ ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అంటూ వివిధ రకాలుగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండి మీ చుట్టుపక్కల వారిని కూడా జాగ్రత్తపరచాలని త్వరగా డబ్బు సంపాదించుకోవాలనే అత్యాశకు వెళ్లి మోసపోవద్దని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులకు మీ యొక్క బ్యాంక్ వివరాలు కానీ OTP కానీ CCV నంబర్స్ గాని పాస్వర్డ్ గానీ తెలియజేయకూడదని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ పిజి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రావ్ గారితో పాటు సైబర్ సెల్ నంద్యాల సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ పోలీస్ స్టేషన్ లలో పెండింగ్ లో ఉన్న అసహజ మరణాలు మరియు మిస్సింగ్ కేసుల పురోగతి గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా, ఐపిఎస్ గారు.
Plz aap Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
నంద్యాల జిల్లాలో గల అన్నీ పోలీస్ స్టేషన్ లలో లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి అసహజ మరణాలు మరియు మిస్సింగ్ కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి గారితో పాటు DCRB CI జయరాములు గారు, స్పెషల్ బ్రాంచ్ CI లు మోహన్ రెడ్డి గారు, ఎరిషా వలి గారు, విజయ భాస్కర్ గారు, నంద్యాల తాలూకా CI Asrar Basha గారు, నంద్యాల 2 టౌన్ CI ఇస్మాయిల్ గారు, సైబర్ సెల్ & సోషల్ మీడియా CI ప్రియతమ్ రెడ్డి గారు, వివిధ పోలీస్ స్టేషన్ ల SI లు మరియ CC నాగరాజు గారు పాల్గొన్నారు.
డోన్ పట్టణంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పి.యస్ ను ప్రారంభించిన ఎస్పి శ్రీ అధిరాజ్ సింగ్ రాణా, IPS. గారు
నంద్యాల జిల్లా డోన్ సబ్ డివిజన్ లోని డోన్ పట్టణంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పి.యస్ ను నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా, IPS గారు మరియు డోన్ నియోజక వర్గం MLA శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.
జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ డోన్ పట్టణం లో ట్రాఫిక్ నిబందనలు అమలులో ఉంటాయి, రూల్స్ పాటించని వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి గారితో పాటు డోన్ నియోజక వర్గం MLA శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు, డోన్ టౌన్ CI ఇంతియాజ్ బాష గారు, డోన్ రూరల్ CI సిఎం రాకేశ్ గారు, ప్యాపిలి CI వెంకటరామిరెడ్డి గారు మరియు ఎస్ఐ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల.