నల్లేరు డొంకలమీద, చెట్ల మీద దాదాపు పది మీటర్ల దాకా తీగలా పెరుగుతుంది. శాస్త్రీయంగా సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అని పిలిచే ఈ మొక్క ‘శాఖలు నాలుగు పలకల కాడల్లా ఉంటాయి. కొన్ని రెండు, మూడు పలకల / జాతులూ ఉన్నాయి.
ఔషధ గుణాలు మాత్రం అన్నింటిలో ఒకే విధంగ ఉంటాయి, ఈ మొక్క కణుపులు కలిగి ఉండి ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో లేదా గుండ్రని పెళుసైన ఆకులు ఉంటాయి.
ఈ కణపుల వద్ద సన్నటి తీగలు కూడా వస్తాయి. పుష్పాలు వంగపండు రంగులో, ఫలాలు సన్నగా, ఎర్రగా ఉంటాయి. నల్లేరు కాడ అంతా నారతో కూడి వుండి, చేతితో నలిపితే దురద పెడుతుంది.
నల్లేరు లేత కాడలు దంచి ఉప్పు, కారం వగైరా చేర్చి వడియాలు చేసి ఎండించి నూనెలో గానీ, నెయ్యిలో గాని వేయించుకు తింటే కఫహరంగా ఉంటుంది.
ఈ వడియాలను నిప్పులపై కాల్చి తింటే అరుచి తగ్గి జీర్యక్రియ మెరుగుపడి రక్తశుద్ధి జరుగుతుంది.
లేత నల్లేరు పచ్చడి చేసుకుని తింటూ ఉంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై విరేచనం సాఫీగా అవటంతో పాటు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
నల్లేరు కాడలను నిప్పుల మీద కొద్దిసేపు ఉడికించి దంచి తీసిన రసాన్ని 10-20 మి.లీ. సేవిస్తే బాగా ఇబ్బంది పెడుతున్న ఎక్కిళ్ళు అదుపులోకి వస్తాయి.
బాగా ముదిరి లావుగా ఉన్న నల్లేరు కాడల్ని ఎండబెట్టి పొడిచేసి దానికి నాలుగో వంతు వేయించిన పిప్పళ్ళపొడి కలిపి ..
పావు స్పూన్ వంతున రోజూ ” రెండు మార్లు తేనెతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం త్వరగా తగ్గుతాయి.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
నల్లేరు ఒకభాగం, ఉప్పు రెండు భాగాలు కలిపి ఒక కుండలో వేసి మాడ్చి ఆ చూర్ణాన్ని అర స్పూన్ చొప్పున ఉదయం, సాయంత్రం ,
మజ్జిగతో సేవిస్తే కడుపు నొప్పులు తగ్గుతాయి. నల్లేరు చూర్ణాన్ని ఒక గ్రాము చొప్పున రోజూ ఒకమారు పంచదార, నెయ్యి కలిపి తీసుకుంటుంటే మూలవ్యాధిలో త్వరగా సుగుణం కనిపిస్తుంది.
ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ వంతున బియ్యం కడుగుతో సేవిస్తే బహిష్టు క్రమబద్ధ మవుతుంది. నల్లేరు రసం చెవిలో వేస్తే చెవిలో చీము కారటం తగ్గుతుంది.
నల్లేరును ముద్దగా దంచి పాము కాటుపై ఉంచి దానిపై రాగిరేకు పెట్టి కట్టుకట్టడం గిరిజనులు చేసే వైద్యం.
నల్లేరును బాగా ఎండించి కాల్చి బూడిద చేసి దానికి ఆరు రెట్ల నీరు చేర్చి బాగా కలిపి ఒక రోజంతా అలాగే ఉంచి నీరంతా ఇగురువరకు వేడిచేస్తే పాత్ర అడుగును మిగిలివున్న పదార్థాన్ని నల్లేరు క్షారం అంటారు.
ఈ క్షారాన్ని పావు స్పూన్ ప్రమాణం నీళ్ళతో ఇస్తే మూత్రం జారీ అవటంతోపాటు ఊపిరి. తిత్తుల్లోని శ్లేష్మం సులువుగా బయటకు వచ్చి ఆయాసం తగ్గుతుంది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
వైద్య ఔషధంలో నల్లేరు
రక్తంలో! హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారికి, కామెర్లు ఉబ్బు వ్యాధి గలవారికి ఈ … క్షారాన్ని లోహ, మండూర లేదా కాసీన భస్మాలతో కలిపి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
కారుణాయ్ లేహ్యం అనే సిద్ధ వైద్య ఔషధంలో నల్లేరును ఒక అను ఘటకంగా వుపయోగిస్తారు. ఈ లేహ్యాన్ని ప్రధానంగా మూలవ్యాధుల్లో ఉపయోగిస్తారు.