- చెంచుల గూడెంలో మౌలిక వసతుల లేమి..
- ప్రత్యేక అధికారులను నియమించినా…ఫలితం శూన్యం..
- అడవి బిడ్డలమైన మమ్మల్ని మనుషులుగా గుర్తించండి..అంటూ అర్థనాదాలు
జనావాసాలకు దూరంగా నల్లమల అటవీ ప్రాంతంలో క్రూర మృగాలు, వన్య ప్రాణుల మధ్య నివాసముండే అడవి బిడ్డలమైన మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మహాప్రభో అంటూ నల్లమల చెంచు గిరిజనులు ఘోషిస్తున్నారు. చదువు సంధ్యా లేకపోవడంతో ప్రభుత్వం నుండి వచ్చే పధకాలు గాని ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎవరిని అడగాలి అన్న సమాచారం కూడా ఆ అడవి బిడ్డలకు తెలియదు.
బండి ఆత్మకూరు మండలంలో నారపురెడ్డి కుంటతో .. సహా మరో రెండు చెంచు గూడెం లు ఉన్నాయి. ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన వారి జీవితాలు మాత్రం మారడం లేదు. ఈ మూడు చెంచు గూడెం లు కూడా మజరా గ్రామాలు.. ఇప్పటికీ ఈ గిరిజన తండాలలో మౌలిక వసతులు లేక అడవి బిడ్డలు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. సరైన రోడ్లు, నివాసం ఉండడానికి ఇళ్ళు కూడా కనపడవు.
ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఆధార్ కార్డు లు , రేషన్ కార్డులు లేని వారు కూడా ఇప్పటికీ ఉన్నారంటే వారికోసం అధికార యంత్రాంగం ఏ మేర పని చేస్తుందో అవగతం అవుతుంది. మెరుగైన వైద్యం లేక కూడా వ్యాధుల బారిన పది మృత్యువాత పడిన సంఘటనలు కూడా కోకొల్లలు, అంతేకాకుండా గర్భవతులైన గిరిజన మహిళలకు సరైన పౌష్టికాహారం అందక, సరైన వైద్యం లేక, వారికి సలహాలు సూచనలు ఇచ్చేవారు లేక తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రసవిస్తున్నారు. కొంతమంది పురిటిలోనే చనిపోతున్నారు.
ఇప్పటికీ చెంచు గూడెం లలో.. మరుగుదొడ్ల సౌకర్యం లేక చీరలతో కట్టుకున్న బాత్రూంలు దర్శనమి స్తున్నాయు. కొంతమంది తారు పట్టాలతో వేసుకున్న గుడి సెలె నివాసాలయ్యాయి. వర్షాలు వచ్చినప్పుడు వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెండుల కోసం చెంచు గూడాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారికి కావలసిన మౌలిక సరులను కల్పించాలని ఆదేశాలున్నాయి. కానీ, చెంచు గూడెం లకు వెళ్లే అడికారులే కనుమారుగైయ్యారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు. మాత్రమే గిరిపుత్రుల అవసరాలు తీరుస్తున్నామంటూ అధికారులు వారి వద్దకు వెళుతున్నారు. అంతే తప్ప అధికారులు కాగితాలపై రాసుకున్న సమస్యలను తీర్చలేదు అనడానికి నిలవెత్తు సాక్ష్యాలు గూడెం లలో.. కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ రెండుగుడాలను పర్యవేక్షించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మా బ్రతుకులకు వెలుగులు నింపాలని అడవి బిడ్డలు కోరుతున్నారు.