శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో సినీ హీరో సుమన్ సందడి…
నంద్యాల జిల్లా.. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో సందడి చేశాడు ఓ ప్రైవేటు బట్టల షాపును సినీ హీరో సుమన్ ప్రారంబించడానికి వచ్చారు.
కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎద్దుల కాటన్ వస్త్ర కంపెనీ యజమాని ఎద్దుల మహేష్ కు చెందిన షోరూమును సినీ హీరో సుమన్ ప్రారంభించారు.
సినీహీరో హీరో సుమన్ చూడడానికి ఒక ఆత్మకూరు పట్టణ , మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎద్దుల కాటన్ ప్రైవేట్ కంపెనీ సంబంధించిన బట్టల షాపును హీరో సుమన్ జ్యోతి ప్రజ్వలన చేసి షాపును ప్రారంభించారు.
అనంతరం షాపులో కొద్దిసేపు అందరితో ముచ్చడించారు. రేట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు . పెద్ద ఎత్తున ఆయనను చూడడానికి అభిమానులు తరలి రావడంతో..
ప్రజలను ఉద్దేశించి హీరో సుమన్ మాట్లాడారు.
మీ అభిమానానికి వందనం
ఆత్మకూరు పట్టణానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని .. నన్ను చూడడానికి వచ్చిన ప్రజలకు అభిమానులకు నా.. హృదయపూర్వక అభినందనలు తెలుపు తున్నానని అన్నారు.
అలాగే మీ ఆశీస్సులు నాకు ఇంకా కలగాలని.. మీ ఆశీస్సులతో నేను ఇప్పటికే 900 సినిమాలకు పైగా .. తెలుగు , తమిళ , కన్నడంలో.. నటించానని అన్నారు.
అలాగే మీ ఆశీస్సులు ఉంటే నేను మరిన్ని సినిమాలో తీస్తానని తెలిపారు. Also Read
ఆత్మకూరులో నన్ను నా.. సినిమాలను అదరించే అభిమానులు ఉన్నారు
ఈ ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు జనాభా ఎక్కువ ఉన్నారని.. నా అభిమానులు కూడా ఇద్దరు ఉన్నారని వాళ్ళ పేర్లతో సహా పిలిచి వారిని పైకి రమ్మన్నాడు.
అలాగే వారి గురించి కూడా చెప్పాడు. ఆయన అభిమానులను గుర్తు చేయగానే ..సినీ హీరో సుమన్ ఎంత ఎదిగినా.. ఒదిగి ఉన్నాడనే బావన ప్రజల్లో కలిగింది.
ఆత్మకూరు పట్టణంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని గమనించిన సుమన్ ముందుగా ఉర్దూలో ప్రసంగించాడు. ఉర్దూలో ప్రసంగించి ఇక్కడి ముస్లింలను ఆకట్టుకున్నారు.
ఆయన మాట్లాడినంత సేపు ఈలలు చప్పట్లతో అభినందనలు వెల్లువెత్తాయి.
అనంతరం తెలుగులో కూడా ఆయన ప్రసంగించారు ఎద్దుల బ్రదర్స్ ఏర్పాటు చేసిన కాటన్ బట్టల షాపును ప్రారంభించడానికి వచ్చానని..
మారుమూల గ్రామాల్లో కుడా బ్రాండెడ్ దుస్తులు సామాన్యువుడికి అందుబాటులోకి తేవడం మహేష్ లక్ష్యం అని అన్నారు. మంచి నాణ్యమైన బట్టలు అలాగే
ఆన్లైన్ రేటు కన్నా తక్కువ ధరలకే వీళ్ళు విక్రయించడంతో వారిని అభినందించాడు. ఆత్మకూరు పట్టణంలో షాపులు ప్రారంభించిన ఎద్దుల బ్రదర్స్
ఇక్కడ స్థానికులకే ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేస్తాననడం పట్టణ వాసులకు మంచి శుభ పరిణామం అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని ప్రజలను కోరారు.
మరో రెండు కొత్త సినిమాలు రాబోతున్నాయి ఆదరించండి.. హీరో సుమన్
ఈ మధ్యకాలంలో మరో రెండు సినిమాలు రాబోతున్నాయని కర్నూల్ లోనే షూటింగు అన్నారు
Also Read నల్లమలలో అడవిదున్న ప్రత్యక్షం