తమ్మడపల్లెలో గడపగడపకు మన ప్రభుత్వం – MLA కాటసాని
బనగానపల్లె మండలం తమ్మడపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు.
గ్రామం లో ఇంటింటి కి వెళ్లి జగనన్న మూడు సంవత్సరాల కాలంలో అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియ జేస్తూ..
గడప గడప కు మన ప్రభుత్వం కార్య క్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా అర్హులైన లబ్ధిదారులకు ఏదైనా కారణాల తో సంక్షేమ పథకాలు రాలేదని తెలిస్తే..
వారికి సంక్షేమ పథకాలు అందే టట్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా..
అక్కడ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్లే వారని అలాకాకుండా..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తరువాత రాజకీయం లో కూడా అనుహ్య మార్పులను తీసుకు రావడం జరిగిందని అందులో భాగంగానే..
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చ డానికి వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా వారితోనే తెలుసుకోవడం జరుగుతుందని అలాగే అర్హులైన వారు ఉండి కూడా వారికి ఏదైనా కారణాలతో..
సంక్షేమ పథకాలు రానివారిని వెంటనే అధికారులకు ఆదేశించడం జరుగుతుందని చెప్పారు. ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన మన..
ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తమ్మడ పల్లె గ్రామ సర్పంచ్ వై వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ రాముడు నాయక్, పెద్ద తిమ్మయ్య, మాజీ సర్పంచ్ గోపాల్,
విద్యా కమిటీ చైర్మన్ మధు, కుళాయి రెడ్డి ,ఉప్పరి నెహ్రూ మద్దిలేటి, అంబటి వెంకట సుబ్బారెడ్డి, మధు సూదన్ రెడ్డి, రాంగోపాల్ ,
జి గోపాల్, శ్రీను, బాల రాజు, మాదిగ శీలయ్య, సూరన్న, రంగన్న, పెద్ద రంగన్న, చిన్న రంగన్న, వెంకటేశ్వర రెడ్డి, బోయ మధు, బోయ నాయుడు, ఆది మూలపు సుంకన్న, ఆది మూలపు చిన్న సుంకన్న, ఎర్రబాలి సుంకన్న, జలుగు దుబ్బ రంగన్న, వై బాలస్వామి, ఎన్ ఓబులేష్, వై పెద్ద మద్ది లేటి, గొల్ల పెద్దన్న, శేఖర్, చిన్న తిమ్మయ్య మద్ది లేటి, మాదిగ తిరుపాలు, మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటరీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.