నది జీవనం
సృష్టి ఎక్కడ మొదలైంది?మొదట ప్రాణి ఎక్కడ పుట్టింది?ఇతిమిద్దంగా తేలని అంశం ఇది,కాని “జలం” వున్న దగ్గరే సృష్టి మొదలైంది, ప్రాణి పుట్టుంది అనటం అంగీకరించ దగిన వాదన.
సిందు అయిన మరొ నాగరికత అయిన అభివృద్ది చెందింది నది మార్గంలోనె. నవీన కాలంలో పట్టణాలు నదుల ఒడ్డునే వెలసి ఆ నదులను కల్ముషం చేసి నీటిని విషతుల్యం చేసాయి.
నేను గత మూడు సంవత్సరాలుగా నివసిస్తున్న “మిన్నెసొట” రాష్ట్రం “Land Of 10,000 lakes”గా ప్రసిద్ది చెందింది.
ప్రపంచంలొ నాలుగో సుదీర్ఘ నది “మిసిసిప్పి” మిన్నసోట రాష్ట్రలోనే పుడుతుంది.
మిసిసిప్పి 3730 కి.మీ ప్రయాణం చేసి Gulf of Mexicoలొ “అట్లాంటిక్” సముద్రంలో కలుస్తుంది.
అమెరికా లొ అనేక రాష్ట్రాల పేర్లు స్థానికంగా ప్రవహించే నదుల పేర్లే! మిన్నెసోటా అనే ఒక నది మిన్నెసోట రాష్ట్రంలో వుంది, ఇది మిసిసిప్పి నదికి ఉప నది.
Wisconsin,Iowa,Illinois, Missouri, Kentucky,Tennessee,Arkansas, Mississippi and Louisiana ఈ రాష్ట్రాలన్ని అక్కడ ప్రవహించే నదుల పేర్లతో ఏర్పడ్డవే,
ఇవన్ని కూడ మిసిసిప్పి నదికి ఉపనదులు.మొత్తం 31 రాష్ట్రాలలో ప్రవహించి నదులు మిసిసిప్పి నదిలో కలుస్తున్నాయి. నది మూలం ఏమిటి అన్న ఆసక్తితో..
అనేక మంది మిసిసిప్పి “జన్మ స్థానం” కనుక్కోవటం కోసం ప్రయత్నం చేశారు.
1783లొ బ్రిటీష్ ఆదిపత్యంలొ వున్న అమెరికా ప్రాంతాన్ని అమెరికాకు అప్పచెప్పటంతో మిసిసిప్పి నది పశ్చిమ సరిహద్దు అయ్యింది.సరిహద్దు కచ్చితత్వం కోసం
అమెరిక ప్రభుత్వం మిసిసిప్పి origin point కనుక్కోవటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది,చివరికి 1832లొ Lake Itasca మిసిసిప్పి నది మూల స్థానం అని నిర్ధారించారు
మిసిసిప్పి నది ప్రపంచంలో నాలుగో (నైలు,అమొజాన్,యాంగ్ఝి తరువాత) సుదీర్ఘ నదే అయి నప్పటికి పెద్ద నదుల్లొ 15వ స్థానం. దీనికి ప్రధాన కారణం స్థిరమైన వర్ష పాతం
మరియు ఊహించని వరదలు లేక పోవటమే.మిసిసిప్పి నది అనేక చోట్ల చాలా చిన్న కలువలాగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల 4 కి.మీ కన్నా ఎక్కువ వెడల్పులో ప్రవ హిస్తుంది.
జల రవాణాకు మిసిసిప్పి నది ఎక్కువ ఉపయోగ పడుతుంది.
మిసిసిప్పి నది మీద సుమారు 45 డ్యాములు కట్టారు. ప్రతి డ్యాముకు Ships వెళ్ళటానికి Lock-In-Way వుంటుంది.
మిసిసిప్పి మీద వుండే డ్యాములు మన దేశంలొని రిజర్వాయరలగా భారీగా వుండవు.వ్యవసాయం కన్నా power generation కోసమే ఎక్కువ డ్యాములు కట్టారు.
ప్రతి సంవత్సరం జనవరి నెలలో మిన్నెసోట,విస్కాన్సిన్లాంటి రాష్ట్రాల్లొ ఉష్ణోగ్రతలు -35 నుంచి -40 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి, మిసిసిప్పి నది పూర్తిగా గడ్డ కడుతుంది.
మార్చ్ తరువాత నుంచి మంచు కరగటం మొదలై ఏప్రేల్ చివరికి మళ్ళి నది ప్రవాహం మొదలవు తుంది..
మిసిసిప్పి నది ఆర్టికల్ వ్రాసిన వారు .. శివ రాచర్ల