మంత్రాలయంలో విదేశీ భక్తుల సందడి

mtl-01_0.jpg

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని విదేశీ భక్తులు హిందూ సంప్రదాయ పద్ధతిలో వస్త్రధారణతో దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీ విశ్వానంద గురూజీ నేతృత్వంలో ”భక్తి మార్గ ఇండియా” కార్యక్రమంలో భాగంగా సుమారు వంద మందికి పైగా శ్రీ కృష్ణ భగవానుడి శిష్యులు క్షేత్రాన్ని చేరుకొని గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రుని మూల దర్శించుకున్నారు. జర్మనీ, దక్షిణాఫ్రికా, రష్యా, పోలాండ్‌ మొదలైన దేశాల నుండి భక్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. వారు హిందూ ధర్మ సంప్రదాయ దుస్తులలో వచ్చి కీర్తనలు, శ్రీకృష్ణ మంత్రాన్ని పఠించారు. శనివారం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు బ్రిటీష్‌ కాలంలో ఇనామ్స్‌ కమిషనర్‌ సర్‌ థామస్‌ మన్రో సందర్శన గురించి వివరించారు. రాఘవేంద్రస్వామి సజీవంగా బృందావన ప్రవేశం చేసి నేటికి 350 సంవత్సరాలు గడిచిందని తెలిపారు. శ్రీ రాఘవేంద్రస్వామి గొప్ప ఆధ్యాత్మిక గురువు అని వేదాలపై ఆయన రచించిన వ్యాఖ్యానం జర్మనీ లైబ్రరీలో భద్రపరచబడిందని శ్రీ విశ్వానంద గురూజీకి గుర్తు చేశారు. అనంతరం విదేశీ దర్శకులందరితో శ్రీ రాఘవేంద్ర స్తోత్రాన్ని జపిస్తూ వారితో కలిసి ప్రాకార ప్రదక్షిణ చేశారు. శ్రీ విశ్వానంద గురూజీతో పాటు విదేశీ భక్తులకు శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు మెమోంటో అందజేసి ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top