కడప నగరం, చలమారెడ్డి పల్లి క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 5,000 రూపాయలు విలువ కలిగిన గంజాయి ని స్వాధీనం చేసుకున్న రిమ్స్ పోలీసులు.
విలేకరుల సమావేశం లో వివరాలు వెల్లడించిన రిమ్స్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీ వి.సీతారామిరెడ్డి
కడప టౌన్ ఆగష్టు :- కడప జిల్లా యస్.పి. శ్రీ హర్ష వర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, కడప టౌన్ SB DSP శ్రీ సుధాకర్ గారి పర్యవేక్షణలో.. రిమ్స్ పోలీస్ స్టేషన్ సి.ఐ. వి.సీతారామిరెడ్డి, మరియు సిబ్బందితో కలిసి కడప టౌన్, చలమారెడ్డి పల్లి క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న..
సల్ల నాగేశ్వర్ రెడ్డి అను వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి Rs.5,000/- ల విలువ కలిగిన 1.1 KG ల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారని,రిమ్స్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీ వి.సీతారామిరెడ్డి గారు పత్రిక విలేకరుల సమావేశం లో తెలిపినారు.
కేసు నేపథ్యం:
ఈ కేసులో ముద్దాయిలు అయిన సల్ల నాగేశ్వర్ రెడ్డి, చెప్పిన నిజాలు.. నేను వ్యాపారం చేయడం వలన సంపాదించే డబ్బులతో..
వచ్చు ఆదాయం నా వ్యసనాలకు సరిపడక, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని అనుకుని, గంజాయి వ్యాపారం అయితే తక్కువ సమయం లోనే..
డబ్బులు సంపాదించాలని అనుకుని, నాకు పరిచయస్తుడు అయిన, కడప నగరం, చల్మారెడ్డిపల్లె కి చెందిన సాంబశివుడు ను కలిసి..
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఏదైనా గంజాయి వ్యాపారం చేసుకుంటాను ఎవరైనా తెలిసిన వారు ఉంటె చెప్పమని అడిగినాను. అందుకు సదరు సాంబ శివుడు, నేను గంజాయి ఇస్తాను..
అధిక ధరకు అమ్ముకుని డబ్బులు సంపాదించుకోమని చెప్పి, నాకు గంజాయి తెచ్చి ఇచ్చినాడు, కడప టౌన్ లో అమ్ముతూ ఉంటాను .
ఆ క్రమం లో వారి పైన జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల యందు గంజాయి కేసులు కూడా నమోదు అయినాయి.
కడప జిల్లా యస్.పి. హర్ష వర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, కడప టౌన్ SB DSP శ్రీ సుధాకర్ గారి పర్యవేక్షణలో వారి పైన నిఘా ఉంచడమైనది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ఈ క్రమం లో ఈ దినం ముందస్తు సమాచారం సదరు వ్యక్తి సల్ల నాగేశ్వర్ రెడ్డి గంజ అమ్ముతున్నాడు అని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
రిమ్స్ పోలీస్ స్టేషన్ సి.ఐ. వి.సీతారామిరెడ్డి మరియు సిబ్బందితో కలిసి కడప నగరం చలమారెడ్డి పల్లి క్రాస్ రోడ్ వద్ద గంజాయిని,
వ్యక్తిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి Rs. 5,000/- ల విలువ కలిగిన 1.1 KG ల గంజాయి ని స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించడమైనది.
ముద్దాయిల వివరములు:
సల్ల నాగేశ్వర్ రెడ్డి, వయసు 23 సంవత్సరాలు, తండ్రి. లేట్ లక్ష్మిరెడ్డి, వృత్తి: వ్యాపారం. స్వగ్రామము: కొండాయపల్లి, చిన్నచౌక్, కడప టౌన్
స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ వివరములు:
1.1 KG ల గంజాయి వాటి విలువ సుమారు Rs.5,000/- లు