–జగన్ సీయం అయిన తర్వాత కరెంట్ చార్జీలు పెరిగాయి, ఆస్తి పన్ను పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త మీద పన్ను వేశారు – మాజీ మంత్రి దేవినేని ఉమా
–15 లక్షల రేషన్ కార్డులు పోయాయి, 6 లక్షల పింఛన్లు తీసేశారు, దీనికోసమా ముద్దులు పెట్టింది.? – మాజీ మంత్రి దేవినేని ఉమా
-పేదవాడు తినే రేషన్ బియ్యం కార్డులు తీసేశారు, బియ్యం తప్ప ఏం ఇవ్వడం లేదు గతంలో పప్పు, ఉప్పు కూడా ఇచ్చాం. – మాజీ మంత్రి దేవినేని ఉమా
-క్రిస్మస్ పండుగకు కానుకలు ఇచ్చేవారం, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ఇచ్చేవారం, అన్న క్యాంటీన్ మూసేశారు, చంద్రన్న భీమా తీసేశారు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఏమైంది – మాజీ మంత్రి దేవినేని ఉమా
కృష్ణాజిల్లా జూపూడి గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా వడ్లు అరబోసిన ధాన్యం రాసుల వద్ద రైతులు, గ్రామస్తులతో కలసి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జూపుడి, కిలేశపురం గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి, పెళ్ళాం పుస్తెలు తాకట్టు పెట్టి శ్రమించి పండించిన పంట కు గిట్టు బాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటి, పెట్టుబడి పెట్టిన రైతు పరిస్థితి ఏంటి, రెండు తుఫాను లు తట్టుకుని నిలబడిన పంట 30 బస్తాలు పండని స్ధితి అని అన్నారు. వాలంటీర్ వస్తాడు, తేమ శాతం చూస్తారు, రైతు భరోసా కేంద్రాలు అన్నారు అని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నటుందని .. కానీ ఏఅధికారి వచ్చాడు, ఏం వాలంటీర్ రైతులను ఆదుకున్నాడు ఏ సొసైటీ ఆయన వచ్చాడు, ఒకవేళ వచ్చినా ఇది పనికిరాదు, అది పనికిరాదు అని చెబుతూ ప్రక్కన పడేశారని ఎద్దేవా చేశారు . క్వింటాల్ కు 5 కిలోల తరుగు తీస్తున్నారు, అవి ఎవరికి పోతున్నాయి, తాడేపల్లి కొంపకా, మంత్రికా, ఎమ్మెల్యేకా, ఇదేమి కర్మ రాష్ట్రానికి, అని ధాన్యం రైతుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరాచాకాలను వివరించారు.
కాంగ్రెస్ హయాంలో నించొబెట్టి కొనిపించామనీ , చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి చూపించామనీ .. 20 సంవత్సరాల క్రితం, తెదేపా హయాంలో తడిసిన రంగు మారీన ధాన్యాన్నికూడా కొనుగోలు చెప్పించామనీ దేవినేని అన్నారు. ధాన్యం బకాయిలు వందల కోట్లు కట్టాలని , డబ్బా బడుల్లో నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి దొడ్డు బియ్యం ఇచ్చి వాటిని మరలా కొనుగోలు చేసి కాకినాడలో అమ్ముకుంటున్నారు.. దోచుకుంటున్నారని మంది పడ్డాడు . పండించిన రైతుకి తినే దిక్కులేదని , ప్రజలకు ఇవ్వడం లేదని , దీని కోసమెనా ఒక్క ఛాన్స్ అడిగింది, ముద్దులు పెట్టింది దీని కొసమా జగన్ ?
జగన్ రెడ్డి.. నీఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, ఫంక్షన్లకు వెళుతున్నావు, మా ధాన్యపు రైతు దగ్గరకు వెళ్ళావా ? అంటూ నిలదీశాడు.. 3 నెలల కాలంలో ఒక్క రైతు దగ్గరికిగాని పొలం దగ్గరికి వెళ్ళావా, మిర్చి, పత్తి రైతు దగ్గరికి వెళ్ళావా ? సమాధానం చెప్పాలని అన్నారు .
పరదాలు కట్టుకుని, ఇంటి చుట్టూ వందల పోలీసులను పహారా పెట్టుకొని, గంటలు గంటలు ట్రాఫిక్ ఆపేయడం తప్ప ఏం లేదని , మీ ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు బూడిద దోచేస్తున్నారు, దాని మీద మా నాయకులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి లేఖ ఇచ్చారని అనారు . కృష్ణాజిల్లాలో ఇసుక మెత్తం ఎమ్మెల్యే దోచుకుంటున్నారు తాడేపల్లి కొంపకు కప్పం కడుతున్నారని , పేదవారు ఎర్రమట్టి తో ఇళ్ళు కట్టుకుంటున్నారుని .. అంతకుముందు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేది 43 నెలల్లో ఏ పంట పండింది లేదని జగన్ రెడ్డి పాదం పెట్టిన తర్వాత ఒక్క రైతు ఆనందంగా లేడని అన్నారు. అన్ని విధాలా ప్రభుత్వం విఫలమైందని దేవినేని ఉమామహేశ్వరావ్ అన్నారు , ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్ళి తెదేపా కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు .