చదువుల తల్లి సరస్వతి దేవి
నంద్యాల జిల్లా, ఆత్మకూరు.
రిపోర్టర్ – కురువ శ్రీనివాసులు—9441840249
నల్లమల అభయారణ్యంలో
తూర్పు నుండి పడమటికి విశాలంగా విస్తరించిన నల్లమల అభయారణ్యం లోని ఒకే కొండలో మూడు ప్రసిద్ధి గాంచిన ప్రముఖ క్షేత్రాలు ఉండడం విశేషం..
అందులో ప్రధానమైనవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబ దేవి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన మల్లికార్జున స్వామి లు రెండు కలిపి ఏర్పడిన శ్రీశైల మహా పుణ్యక్షేత్రం
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయం..
ఈ కొండపైన ఉంది అలాగే సప్తనదుల సంఘమైన దగ్గర వెలసిన పుణ్యక్షేత్రం సంగమేశ్వర క్షేత్రంతో పాటు రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయమైన శ్రీ కొలను భారతి క్షేత్రం
Also Read నల్లమల అవివికి అనుకోని అతిదిగా అడవిదున్నరావడంతో
ఈ మూడు ప్రసిద్ధిగాం చిన పుణ్యక్షేత్రాలు ఒకే కొండలో ఉండడం విశేషం.
ఎన్నో కొండల నడుమ ప్రవహించిన చారు ఘోషిణీ నది, శ్రీ భారతి అమ్మవారి దగ్గర అదృశ్యమవడం విచిత్రం. విశేషం….
కొలను భారతి క్షేత్రం……
శ్రీభారతి క్షేత్రం 11వ శతాబ్దంలో శివపురానికి సమీపాన కొండల్లో ‘కొలను’లో వెలసిన దివ్యక్షేత్రం. భారతదేశంలో మొత్తం నాలుగుచోట్ల వెలిసింది అమ్మవారు. 1. జమ్మూ కాశ్మీర్‌లో సరస్వతిగా 18 శక్తిపీఠాల్లో ప్రధాన పీఠం,…
2వది కర్నాటకలోని శృంగేరిలో శారదాదేవిగా, 3వది ఆది లాబాద్‌లోని బాసరలో జ్ఞానసరస్వతిగా పిలువబడుతూ పూజలందుకొంటోంది.
Also Read Buy a good pen drive now Best Product
అయితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం శివపురం సమీపాన నల్లమల కొండలలో వెలసి శ్రీ కొలను భారతిగా పూజలందుకొంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు అమ్మవారు.
భారత దేశపు విశిష్టత చాటుతూ…
ద్వాదశ నామాల్లో ప్రథమ నామమైన శ్రీ భారతి పేరుతో పిలువబడుతూ మన భారత దేశపు విశిష్టత చాటుతూ… వీణ లేకుండా అభయహస్తం,
ఎడమచేతిలో వేదాలు, మరో కుడిచేతిలో శూలం, మరో ఎడమచేతిలో పాశంతో దర్శనమిస్తుంది. చాళుక్యుల రాజుల కాలం నాటి గతవైభవ భారతదేశపు అగ్రగామి ఈ దేవాలయం.
ఈ ఆలయాన్ని మల్లభూపతి నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
చారు ఘోషిణీ నది
ఎన్నో కొండల నడుమ ప్రవహించిన చారు ఘోషిణీ నది, శ్రీ కొలను భారతి అమ్మవారి దగ్గర అదృశ్యమవడం విచిత్రం. ఈ క్షేత్రానికి తూర్పు ఈశాన్యంలో.. శ్రీశైల పుణ్యక్షేత్రం వుండగా. పడ మర దిశలో సప్తనది సంగమేశ్వరం,అక్కడ ధర్మరాజు చేత వేపదారు శివలింగం ప్రతిష్టింపబడిన క్షేత్రం ఉండడం శ్రీ కొలను భారతి మహిమాన్విత దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. నిశ్శబ్ద వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రం ధ్యానానికి ప్రాధాన్య తనిచ్చేదిగా ఉంది.
విశ్వభారతి గా కూడా పిలువబడే అమ్మవారు
వీణ లేకుండా దర్శ నమిస్తున్న అమ్మ వారి ప్రత్యేకత ఏమిటంటే..ఈ అమ్మవారిని విశ్వ లక్ష్మి, విశ్వపార్వతి, విశ్వ సరస్వతి అని కాకుండా విశ్వభారతి అని పిలుస్తారు. విశ్వానికి సంబంధించిన క్షేత్రంగా ఇక్కడ కొలువైన శ్రీ కొలను భారతి పూజలందుకొంటోంది.
సప్త శివాలయాలు..
ఇక్కడ ఉన్న సప్త శివాలయాలకు ఓ ప్రత్యేకత ఉంది సప్త ఋషులు కృత యుగంలో లోకకళ్యాణార్థం యాగం చేయ తలచి ఈ ప్రాంతానికి వచ్చినట్లు వేదాలు చెబుతున్నాయి.
అయితే యాగాన్ని రక్షించేందుకు అమ్మవారు వారికి,యాగానికి సంరక్షకురాలు గా ఉందని పురాణాలు చెబుతున్నాయి. సప్త ఋషులు తలా ఒక శివలింగాన్ని ప్రదర్శించారు. అయితే సప్త శివాలయాలకు ఏకశిల ధ్వజస్తంభం, ఏక నందీశ్వరుడు మాత్రమే వుంది. యాగానంతరం సత్తా సప్తఋషుల అభ్యర్థన మేరకు అమ్మవారు స్వయంభుగా వెలసిందని పురాణ గాధ….
అక్షరాభ్యాసం
కొలను భారతి క్షేత్రం లో ప్రతి ఏటా వసంత పంచమి రోజు ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు.. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తరలి వస్తారు. ఎందుకంటే ఇక్కడ వెలసిన అమ్మవారు జ్ఞాన సరస్వతి, పుస్తక సరస్వతి అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. వసంత పంచమి రోజు శ్రీశైల దేవస్థానం నుంచి అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
జలపాతాలు
కొలనుభారతి క్షేత్రం లోని అమ్మ దేవాలయం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అడవి లోకి అడవి మార్గం గుండా లోపలికి వెళితే .. కమనీయంగా కనువిందుచేసే జలపాతం కనిపిస్తుంది. దేవాలయానికి వచ్చే భక్తులుచాలా మంది ఇక్కడికి వచ్చి స్నానము ఆచరించి సేదతీరే అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రారంభమైన జలపాతం అమ్మవారి చెంతకు చేరి అమె పాదాల వద్ద అదృశ్యం కావడం వింత విశేషం. ఆశ్చర్యకరం..
ఈ కొలను భారతి క్షేత్రానికి వెళ్ళడానికి..
కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లె మండల కేంద్రం నుండి శివపురము అనే గ్రామనికి ముందుగా భక్తులు చేరుకోవాలి. ఇది తారు రోడ్డు. గ్రామానికి చేరుకున్నాక, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డులో ప్రయాణించి కొలనుభారతి దేవాలయం చేరుకోవచ్చు. ఈ క్షేత్రం స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుండి పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు… అప్పటినుంచి ఇప్పటివరకు ఎందరో ఎమ్మేల్యేలు గెలిచి నప్పటికీ ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరం…. విచిత్రమేమిటంటే…
తిరుపతి దేవస్థానం దృష్టి సారించాలి
ఈ క్షేత్రం విషయంలో 7వ అంకెకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ కొలనుభారతీ దేవాల యంతో పాటు…7 దేవాలయాలు (బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా), 7 కొండలు (వెంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి, శేషాద్రి, సింహాద్రి)
సప్తనదీ సంగమమైనసంగమేశ్వరం (కృష్ణానది, తుంగభద్ర, భీమరధి, మలప్రభ, ఘటప్రభ, కుమద్వతీం, భవనాశి), సప్తర్షులు (కశ్యప, ఆర్తి, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ట, జమదగ్ని), ఊర్ద్వలోకాలు (భూలోక, భువర్లోక, సువర్లోక, మహల్లోక, జనల్లోక, తపోలోక, సత్యలోక) అలాగే 7 అథోలోకాలు (అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ, నాగ), సప్త ద్వీపాలు (భానుని సప్తాశ్వాలు, సప్తధాతువులు, సప్తస్వ రాలు, ఏడు వారాలు, సప్తమి తిథి.
కొలను భారతి క్షేత్రం..
ఇలా 7 అంకెకు విశేష ప్రాధాన్యత ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (7 కొండలు) సప్త సంగమేశ్వరం(7 నదులు) ..
కొలనుభారతి(7దెవాలయాలు) సూచిస్తున్నందున, విశ్వశాంతి కొరకు విశ్వభారతి అయిన శ్రీ కొలను భారతి క్షేత్రం అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో ఉన్న ఏకైక, పురాతన క్షేత్రమైన ఈ శ్రీ కొలను భారతి ఆలయంను మరింత అభివృద్ధిచేసి భక్తులకు (అన్నదానం, రూములు) వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.