శ్రీ కొలను భారతీదేవి క్షేత్రం
AP : నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపం నల్లమల అభయానందంలో శ్రీ కొనని భారతీదేవి ..మహిమాన్వితదేవతగా.. పూజలందు కొంటోంది..
నంద్యాల జిల్లా లోని ఈ దివ్య క్షేత్రం అత్యంత ప్రాచీన సరస్వతీ క్షేత్రం. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ను దీపిస్తున్న ఏకైక సరస్వతి క్షేత్రమిది. బాసర కంటే ఎంతో పురాతన మైనది శక్తివంతమైనది.. ఈ కొలను భారతి క్షేత్రం.
ఆధ్యాత్మిక విశిష్టత, చరిత్రను బట్టి.. బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం కన్నా పురా తన దేవాలయంగా చరిత్ర కారు లు భావిస్తున్నారు. బాసరలో వీణ సరస్వతిగా భక్తులకు దర్శనం ఇస్తే.. ఇక్కడ పుస్తక సరస్వతి భక్తులకు దర్శనమిస్తున్నారు.. పుస్తక సరస్వతి అంటే చదువుల తల్లిగా భావించి ఇక్కడ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం శ్రీ భారతి క్షేత్రంలోనే చేయిస్తారు. అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి నాడు ప్రతి సంవత్సరం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం శ్రీశైలం నుండి అమ్మవార్ల పట్టు వస్త్రాలు శ్రీ కొలనుభారతి దేనికి శ్రీశైల ఆలయ ఈవో అందించడం జరుగుతుది.అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివార్ల ప్రసాదాలను భక్తులకు అందజేస్తారు.
వసంత పంచమి నాడు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ ,కర్ణాటక , తమిళనాడు ఇలా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్య లో భక్తులు కొలనుభారదీక్షేత్రంలో చిన్నారులకు అక్షరా భ్యాసం చేయిస్తారు. ఆరోజు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు భక్తుల సౌకర్యార్థం కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి భక్తులకు భోజన సదుపాయాలు కల్పిస్తారు .అటు పోలీస్ శాఖ ఎలాంటి ఇబ్బందులు కలవకుండా వారు పర్యవేక్షిస్తారు.
వేదకాలంలో జరిగిన దేవాసుర సంగ్రామసమ యంలో,దేవతలకు విజయం సిద్ధించాలని బ్రహ్మఃదేవేరి సర స్వతీదేవిని యాగ సంరక్షణ బాధ్యత స్వీకరించమని సప్తఋషులు వేడుకోగా, పరాశక్తి తొలిగా ధరించిన పంచరూపాల్లో తొలి నామమైన శ్రీ భారతిగా, ..
పవిత్ర వరుణ తీర్ధములో నిశబ్దవాహినిగా ఖ్యాతిగాంచిన చారుఘోశిని నదిలోని,కొలనుతీరాన,శ్రీకొలను భారతి నామంతో స్వయం భువుగా సరస్వతీ అమ్మ వెలి సింది.
Also Read నల్లమలకు అడవి దున్న
ఇక్కడ అమ్మవారి ఎదుట శ్రీ చక్రం ఉండటంవిశేషం.శ్రీశైలానికి పశ్చిమ దిక్కులో ఉన్న ఈ’ కొలను భారతీ అమ్మవారు’, చేతిలో వేదములను ధరించి “పుస్తకపాణి”గాకనపడుతుంది.
నాలుగు కరములు (చేతులు) కలిగిన అమ్మవారు ఉత్తర ముఖంగా దర్శనమిస్తున్నారు. కుడి రెండు చేతుల్లోఅంకుశం, అభయహస్తం, ఎడమ వైపు రెండు చేతుల్లో పుస్తకం, యమ పాశంతో కనిపిస్తారు. 11వ శతాబ్దపు రెండవ చాళుక్యుల పాలనలోని మల్లభూపతి రాజు శిథి లావస్థకు చేరిన అమ్మవారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి నట్లు తెలుస్తోంది. Buy it a good pen drive
ఈ క్షేత్రంలో సప్తశివాలయాలను నిర్మించి శివలింగాలను ఆయనే ప్రతి ష్టించారు.ఇక్కడశ్రీకాలభైరవుడు క్షేత్ర పాలకుడు.21వ శతాబ్ది 2012 లో కాశీనాయన ఆశ్రమం వారుసప్తశివాలయాలజీర్ణోద్ధరణగావించి.నూతనఆలయాల నిర్మించారు. శ్రీకొలనుభారతమ్మ ఆలయమూసర్వాంగసుందరంగా నిర్మింపబడుతోంది.