17వ వార్డు విశ్వనగర్ లో శిల్పాస్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన శిల్పాసేవాసమితి చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి
నంద్యాల పట్టణం 17వ వార్డు విశ్వనగర్లో మంగళవారం శిల్పా సేవాసమితి ఆద్వర్యంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా 60 మంది మహిళలకు టైలరింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా నాగినిరవిసింగారెడ్డి మాట్లాడుతూ… నంద్యాల పట్టణంలో గత 25 సంవత్సరాలుగా శిల్పాసేవాసమితి ఆద్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలకు ప్రధానంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 17వ వార్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచితంగా మహిళలకు కుట్టు, అల్లికలు, తదితర వాటి యందు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇలా మహిళలకు ఆర్థికంగా భలోపేతం కావాలని, ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, స్థానిక కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.