దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి
రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని,దేవాలయాలపై జరుగుతున్న దాడులను అపాలని, హిందూ దేవాలయాలపై జాతీయస్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హైందవ శంఖారావం ప్రతినిధులు ఎం వేణుగోపాల్,,జి సత్యనారాయణ శర్మ,,బి లక్ష్మీనారాయణ ఆచార్యులు పేర్కొన్నారు
ఆదివారం నాడు సాయంత్రం ఆత్మకూరు పట్టణంలోని జి పుల్లారెడ్డి స్కూల్ నందు మండల స్థాయి హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ఆత్మకురు పట్టణ మరియు గ్రామాల నుంచి ఆధ్యాత్మిక,ధార్మిక, అయ్యప్ప భక్తాదులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల కు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే అన్యాక్రాంతమవుతున్నటువంటి దేవాలయ భూములను కాపాడాలని, అన్ని మతస్తులు ఉండకూడదనేటువంటి ప్రధాన అంశాలతో జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం రాష్ట్రస్థాయిలో నిర్వహించడం జరుగుతున్నదని ప్రతి ఒక్క హిందువు ఈ హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు…
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రకండ అధ్యక్షులు సుదర్శన్ శర్మ, హైందవ శంఖారావం తాలూకా కన్వీనర్ శ్రీ వాసుదేవరెడ్డి, ఆవుల రెడ్డి మారం భానుమూర్తి, వినోద్ కుమార్,షేగు కిరణ్ కుమార్, మరియు పట్టణ పుర ప్రముఖులు భీమిశెట్టి కృష్ణమూర్తి, సత్యనారాయణ, విశ్వరూప చారి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాద పంపిణీ జరిగినది.
మండల కన్వీనర్
హైందవ శంఖారావం, ఆత్మకూరు మండలం