- మతాతీత మమకారం…
- మంగళ హారతులతో మైనార్టీ మహిళల స్వాగతం
అద్భుతం… అపూర్వం…గతం లో ఎన్నడూ ఎవరూ చవి చూడని ప్రేమాభిమానం… ఆత్మకూరు పట్టణం లో ఆవిష్కృతం అయింది.
గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్బంగా గురువారం నాడు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 1 వ వార్డు లో ప్రవేశించారు.
కౌన్సిలర్ కలీముల్ల ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు స్వాగతం చెప్పారు.
ఇందులో విశేషం లేదు కాని కొందరు ముస్లిం మహిళ లు మంగళ హారతులు ఇచ్చారు.
సాధారణంగా ఆ మతం కట్టుబాట్ల రీత్యా మైనార్టీ మహిళలు బయట కొచ్చి మంగళ హారతులు ఇవ్వడం ఉండదు.
అయితే, వచ్చింది శిల్పన్న కదా..! ఆయన అన్ని మతాలను సమానం గా చూస్తూ సమతుల్యమైన అభివృద్ధి చేస్తున్నాడు.
పైగా ఆయన సేవా కార్యక్రమాల ద్వారా మహిళలు ఎల్లలు లేని అభిమానం నిలుపుకున్నారు.
మహిళలు హారతులిస్తుంటే ఎమ్మెల్యే శిల్పా తో సహా కార్యకర్తలు ఆనంద డోలికల్లో మునిగిపోయారు.
మేం శిల్పన్న ను మతపరంగా చూడం… శిల్పన్న మాకోసం ఎంతో కష్టపడుతున్నాడు. అన్న వస్తే మా సొంత అన్న వచ్చినట్టే అని ఆ మహిళలు పేర్కొన్నారు.
Aslo Read.. నల్లమల అడవులకు గజ రాజులు
Also Read ..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector