శిల్పా కుటుంబం నిరంతరాయంగా ప్రజా సేవలను అందిస్తోంది… మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి
- ప్రజా సేవలోనే, ప్రజలతోనే ఎల్లపుడూ… మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి
శిల్పా కుటుంబం గత రెండు దశాబ్దాలకు పైగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను నిరంతరాయంగా కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవలను అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పేర్కొన్నారు. సోమవారము శిల్పా సేవా సమితి కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనిట్ లిమిటెడ్ అనంతపురం వారి ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల పాలక వర్గ సభ్యులకు మరియు సభ్యులకు సహకార సంఘం నిర్వహణ, విధులు, భాధ్యతలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి హాజరై అర్హులైన 189 మంది మహిళలకు 30లక్షల 20వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో రాయల సీమ సహకార శిక్షణా కేంద్రం కో ఆపరేటివ్ విద్యా కమిషనర్ నరసింహా రెడ్డి, రిసోర్స్ పర్సన్ భాస్కర్ రెడ్డి స్వయం సహాయ క మహిళలకు శిక్షణ అందించారు.
also Read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలకు పైగా నంద్యాలలో శిల్పా సేవా సమితి అధ్వర్యంలో నిరంతరంగా పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. పేదింటి మహిళల ఆర్థిక స్వావలంబన శిల్పా మహిళా సాహకార్ బ్యాంక్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, ఐతే తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు సవ్యంగా కొనసాగకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలు చేయడంలో తమతో పోటీ పడాలే తప్ప అనవసర విమర్శలు తగవన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సేవాసమితి మేనేజర్ లక్ష్మీ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..