తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

Elections again in Telangana.. High Court gives key orders to the governmen

Elections again in Telangana.. High Court gives key orders to the governmen

  • తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
  • తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
  • ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది.

మేం రిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణఫై కాదని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై వివాదం లేనిచోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడంతో.. ఎస్‌ఈసీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజించి ఎన్నికలు నిర్వహించడం సరికాదని హైకోర్టు సూచించింది. నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

గతంలో బీసీ రిజర్వేషన్ల వలన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడదల చేయడంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులు జోక్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. తాజాగా.. హైకోర్టులో ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top