నెల్లూరు జిల్లా..వెంకటాచలం
నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ రావుని ఢీ కొట్టిన వాహనం
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా డీఎస్పీ ఢీ కొట్టి వాహనం తో పరార్ అయిన దుండగుడు
నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్న వారే ఈ DSP ని ఢీ కొట్టి వుంటారని అనుమానం
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న DSP శ్రీనివాస్ రావు
తెల్లవారు ఝామున వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాస రావును ఓ వాహనం ఢీ కొట్టింది.
మత్తు పదార్థాల రవాణా అరికట్టడమే లక్ష్యం లో భాగంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన రూరల్ డీఎస్పీ వెంకటాచలం
టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుకోకుండా ఓ వాహనం ఆపినట్టే ఆపి ఒక్క సారిగా డీఎస్పీ నీ ఢీ కొట్టి వెళ్లినట్టు దీంతో..
డీఎస్పీ శ్రీనివాస్ రావుని నెల్లూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం,దుండగులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- నెల్లూరు రూరల్ డీఎస్పీ నీ ఢీ కొట్టిన నిందితుడిని వాహనం తో పాటు మర్రిపాడు వద్ద పట్టుకున్న పోలీసులు
- నిందితుడిని వాహనాన్ని చేజ్ చేసి పట్టుకునే క్రమం లో అదుపుతప్పిన ఆత్మకూరు సిఐ వాహనం, సిఐ కి తృటిలో తప్పిన పెను ప్రమాదం
- నిందితుడు రాజమండ్రి వద్ద రాజానగరం కు చెందిన సూర్యనారాయణ గా గుర్తింపు
జాతీయ రహదారిపై బొలెరో వాహనంలో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నారు.. అన్న సమాచారం మేరకు రాత్రి డ్యూటీలో ఉన్న నెల్లూరు రూరల్..
డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు, వెంకటాచలం సిఐ సుబ్బారావు మనుబోలు ఎస్సై అజయ్ మరి కొంత మంది పోలీస్ సిబ్బంది గత రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా..
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
అనుమానాస్పదంగా వచ్చిన ఒక బొలెరో వాహనాన్ని ఆపి మాట్లాడుతుండగా డి.ఎస్.పి ఆ వాహనాన్ని పట్టుకొని నిలబడి వున్న సమయం లో నిందితుడు ఒక్కసారిగా వాహనాన్ని డి.ఎస్.పి ని ఢీకొట్టి వాహనంతో పరార్ అయ్యాడు .
వాహనం ఢీ కొట్టడంతో కింద పడిపోయిన డిఎస్పి నుదుటికి గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది . పోలీసులు ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైన ..
డిఎస్పి కి వైద్యం అందించాలనే తాపత్రయంతో ఉండగా నిందితుడు అతివేగంగా టోల్ ప్లాజా ను ఢీ కొట్టి గూడూరు వైపు వెళ్లిపోయాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడు వాహనానికి సంబంధించిన సమాచారం అన్ని పోలీస్ స్టేషన్ లకు అందివ్వడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆత్మకూరు సిఐని కూడా ఢీ కొట్టే ప్రయత్నం
ఈ క్రమంలో నిందితుడు మనుబోలు సమీపంలోని కాగితాలు పూర్ రోడ్డు మీదుగా పొదలకూరు సంఘం ఆత్మకూరు మీదుగా మర్రిపాడు సమీపిస్తుండగా..
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
అప్పటికే వాహన తనిఖీలు చేపట్టిన ఆత్మకూరు సిఐ బొలెరో వాహనాన్ని గుర్తించి ఆపబోగా అక్కడ కూడా వాహనం అతివేగంగా వెళ్లడంతో ఈ నిందితుడి వాహనాన్ని ఆత్మకూరు సిఐ తన వాహనంతో వెంబడించారు..
ఈ క్రమంలో చాలా దూరం చేజింగ్ చేసిన తర్వాత ఆత్మకూరు పోలీసుల వాహనాలు అడ్డం పెట్టి నిందితుడి వాహనాన్ని అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఆత్మకూరు సిఐ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు సైడ్ కు వెళ్లిపోయింది. అయితే వాహనంలో ఉన్న ఆత్మకూరు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు, దీంతో ఆత్మకూరు సిఐ కి పెను ప్రమాదం తప్పింది…
నిందితుడు ఉపయోగించిన బొలోరో వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిని పట్టుకుని విచారించగా ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు రాజమండ్రి సమీపంలోని రాజానగరంకు చెందిన సూర్యనారాయణ తండ్రి కన్నయ్యగా గుర్తించారు.
పట్టుబడిన బొలెరో వాహనంలో ఎటువంటి గంజాయి లభించకపోవడంతో మార్గమధ్యంలో నిందితుడు ఎక్కడైనా ఈ గంజాయిని దించివేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం పోలీసులు తెలపాల్సి ఉంది…