పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్ట్ లకు నీరు విడుదల
రాయలసీమ ప్రాంత రైతులకు శుభ పరిణామం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, జూలై 27:-
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రాయసీమ లోని రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నీటిని విడుదల చేశారు.
శనివారం నాడు నందికొట్కూరు శాసన సభ్యులు గిత్త జయ సూర్యతో కలిసి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ మధ్య గేటుకు సాంప్రదాయ రీతిలో..
పూజలు నిర్వహించి బటన్ నొక్కి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీరే సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు.
ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని..
విడుదల చేయడం రాయలసీమ రైతు లందరికీ శుభ పరిణామం అన్నారు. కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడం వల్ల భారీగా వరద నీరు..
శ్రీశైలం జలా శయానికి పొటెత్త డంతో జులై నెలలోనే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యు లేటర్ నుండి నీటిని విడుదల చేస్తున్నామనీ అన్నారు .
Also Read అత్తగారింటికి వెళ్ళడానికి RTC బస్సు చోరీ..చేసిన అల్లుడు
ప్రస్తుతం 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని సాయంత్రానికి పదివేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల పెంపుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 16.95 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ 12 టీఎంసీలు,
గోరుకొల్లు రిజర్వాయర్లకు 4.1 టీఎంసీల సామర్థ్యం వరకు నీటితో నింపు తామన్నారు. ఉద్యాన పంటల సాగులో నీరు ఆదా కావడంతో పాటు అధిక ఆదాయం వస్తోందని
రైతు లందరూ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించి వచ్చే అవకాశాలను అంది పుచ్చుకోవాలని రైతులను సూచించారు.
పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై రాయలసీమ ప్రాంత రైతులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.
నందికొట్కూరు శాసన సభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురవడం వల్ల కృష్ణా బేసిన్ లోని…
అన్ని డ్యాములు నిండు తున్నాయన్నారు. శ్రీశైల జలాశయ వెనుకటి జలాలతో తెలుగు గంగా, ఎస్ఆర్బిసి కాలువల ద్వారా రాయలసీమ రైతాంగానికి ఉపయోగపడే.
విధంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. శ్రీశైలం ముప్పు ప్రాంతానికి గురై 98 జీఓలోని సమస్యలను..
మీ దృష్టికి తీసుకొస్తామని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. జల వనరుల శాఖ ఎస్ఈ వెంకట రమణ, ఆకుకూరు ఆర్డీవో ఎం దాసు పోతులపాడు గ్రామ సర్పంచ్ నిర్మలమ్మ, డి ఇ లు, ఏ ఈలు , టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector