నల్లమల అందాలను చూడాలంటే వానా కాలంలో చూస్తేనే .. ఆ ప్రకృతి రమణీయం ఆకర్షిస్తుంది. కొండ సిగలపై దట్టమైన చెట్లు.. వెదురు వనాలు, లోయల్లోకి జాలువారే జలపాతాలు… ఉధృతంగా ప్రవహించే వాగులు… వంకలు… వర్షా నందంతో గంతులు వేసే జింకలు… పక్షుల కిలకిల రాగాలు.. ప్రకృతి సౌందర్యమంతా నల్లమలలోనే కనిపిస్తుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని రమణీయ దృశ్యాలను చూస్తే మది పులకిస్తుంది.
నల్లమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 100 నుంచి 200 అడుగుల ఎత్తయిన కొండల మీద నుంచి జలపాతాలు కిందకు దూకుతున్నాయి.
నల్లమలలోని చిన్నగుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆత్మకూరు రేంజ్‌లోని కొలనుభారతి, శ్రీశైలం రేంజ్‌లోని భీమునికొలను, పెచ్చెర్వు సమీపంలోని పంగిడి, వెలుగోడు రేంజ్‌లోని మొత్త వద్ద ఉన్న నాగులగుండం ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
నాగలూటి రేంజ్ ఇందిరేశ్వరం ఈస్ట్ బీట్‌లోని చిన్నసరి, పెద్దసరి జలపాతాలు, రోళ్లపెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న జలపాతం, శ్రీశైల క్షేత్రంలోని సిద్ధ్దరామప్పకొలను, కొలనుభారతి క్షేత్రంలో చారుఘోషిణి జలపాతం కనువిందు చేస్తున్నాయి.
ఇవి లోతట్టు అడవిలో ఉన్నందు వల్ల పెద్దపులులు, ఎలుగుబంట్ల సంచారం ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు పర్యాటకులకు అటవీ అధికారుల అనుమతి కావాలి. గుమ్మితం లాంటి అరుదైన జలాపాతాలెన్నో నల్లమలలో ఉన్నాయి. అటవీ అధికారుల నిబంధనల వల్ల ఇవి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు.
ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకపోయినా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ పరిధిలోని అటవీ సమీపాన ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు మాత్రం..
నిత్యం ఫారెస్ట్ అధికారుల కట్టబడకుండా ఏదో ఒక మార్గాన అడవిలోకి చొరబడి ఈ అరుదైన గుమ్మితం జలపాతాలను మాత్రం ఆస్వాదిస్తూనే ఉంటారు.
గుమ్మితం జలపాతాలను ఆస్వాదించడానికి నానా అవస్తలు పడుతుంటారు, ఫారెస్ట్ అధికారులతో గొడవలకు దిగిన సంఘటనలు ఉన్నాయి.
అయినా అవేవీ లెక్కచేయకుండా ఆ ప్రాంత ప్రజలు మాత్రం వెళ్తుండడం చూస్తే అక్కడ గుమ్మితం జలపాతాలు ఎంతటి అనుభూతి కలిగిస్తుందో చెప్పనక్కరలేదు.
గుమ్మితం జలపాతాలకు అనుమతివ్వాలి
పర్యావరణ ప్రేమికులు మాత్రం అటవీ అధికారులకు గుమ్మితం జలపాతాలను చూడటానికి అనుమతివ్వాలని ఎన్నోసార్లు కోరారు.
ఇలా నాచురల్ గా ఏర్పడిన ఈ జలపాతాలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారని అటువంటి అందాలను బయటికి చూపితేనే .. రాష్ట్ర ప్రజలకు నల్లమల అడవికి ఒక ప్రత్యేకత ఉంటుందన్న భావాన్ని వెలిబుచ్చారు.
ఎలాగైతే బైర్లుటి ఏకో టూరిజం ని ఏర్పాటు చేశారు . అక్కడికి వచ్చిన సందర్శకులకు జంగిల్ సఫారీలో పర్యాటకులను తీసుకుకొని వెళ్లి..
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ఫారెస్ట్ అధికారులు దగ్గరుండి ఈ జలపాతాలను చూసే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు . అటవీ శాఖకు కూడా మరింత ఆదాయం పెరుగుతుందని అన్నారు .
అలాగే నంద్యాల జిల్లాలో ఉన్న ఈ దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతానికి రాష్ట వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని సూచించారు.
చూసిన పర్యాటకులకు కూడా మరిచిపోలేని అనుభూతి పర్యావరణం పై ఉంటుందని ఇలాంటి రమణీయమైన సన్నివేశం గుమ్మితం జలపాతాన్ని చూస్తేనే కలుగుతుందని .
ఎలాగైనా ప్రజలకు గుమ్మితం జలపాతాన్ని మరింత చేరువ చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు #ChinnaGummitamWaterFals