పశువుల సంరక్షణ

Care of cattle

Care of cattle

గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతిలో విపరీతమైన ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. ఎలినినో తదితర కారణాలుగా ఎండాకాలంలో అతిగా వర్షాలు, వానాకాలంలో అనావృష్టి వంటి ఆకస్మిక పరిణామాలవల్ల పొడి, పంటలు, జనావాసాలతో పాటు వన్యప్రాణులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురౌతూ ప్రాణాలను కూడా కోల్పోతున్నాయి.

రోహిణీ కార్తెలో కూడా తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలు పిడుగుపాట్లకు, గాలివానలకే కాక వరదలకు కూడా గురికావటం, అనేక మంది ప్రజలు, పశువులు, జీవాలు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం కూడా జరగటం చూశాము.

ఈ సంవత్సరం కూడా వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనడానికి మన రైతాంగంతో పాటు మన ప్రభుత్వాలు కూడా ముందుగా సిద్ధంగా వుంటే ప్రకృతి బీభత్సాల వల్ల కలుగబోయే నష్టాలను కొంతమేరకైనా తగ్గించుకో గల్గుతాము.

ఇందుకు వాతావరణ శాఖ వారు ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ వారు ఇచ్చే సూచనలను సకాలంలో పాటించుట చాలా అవసరం!

ఇప్పటికే మే నెలలోనే అనేక ప్రాంతాలలో పిడుగుపాటుకు వందల సంఖ్యలో పశువులు, జీవాలు కొన్ని ప్రాంతాలలో మనుషులు కూడా ప్రాణాలను కోల్పోగా, అకాల, ఆకస్మిక వర్షాల వల్ల వరి, మిర్చి, తదితర పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది.

వడగళ్ల వల్ల జంతుజాలం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. పిడుగుపాటు ముప్పు ఎక్కువగా వుంటే పశువుల్ని, జీవాలను చెట్ల క్రింద, షెడ్లలో కాకుండా పటిష్టమైన నిర్మాణాలలోకి ఆరుబయలు స్థలాలకు తరలించుట మంచిది.

వర్షపు నీరు పశువుల పాకలు, చావిళ్లలో నిలిచిపోకుండా వాటిని పరిసరాలకు కనీసం ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకొని, వాననీటితో పాటు మురుగు నీరు కూడా దూరంగా తరలి పోయే విధంగా పక్కా కాకపోయినా కనీసం కచ్చా డ్రెయినేజ్ వ్యవస్థనైనా ఏర్పాటు చేసుకోవాలి.

ఎక్కువ రోజులు ముసురు వుంటే వీలైతే జీవాలను, పశువుల్ని డాబాల మీదకు తరలించి వాటిని కాపాడిన దృశ్యాలను మనం గత సంవత్సరం గమనించాము.

ఇది కూడా మంచిదే! ఇందువల్ల గిట్టలు బురద, రొచ్చులో నాని పాచి పట్టి పుండ్లు కాకుండా ఉంటుంది. ముసురు -చిత్తడి వాతావరణంలో పసిదూడలు ఎక్కువగా మరణించే అవకాశాలు వుంటాయి.

కాబట్టి వీటిని వెచ్చని, శుభ్రని పరిసరాలకు తరలించి గోతాములు లేదా పొడి వరిగడ్డి పక్కను ఏర్పాటు చేయాలి.

మన తెలుగు రాష్ట్రాలలో గేదెలే ప్రధాన పాడిపశువులు. ఇవి అక్టోబరు-జనవరి నెలల్లో చూడి కట్టి తొలకరి నాటికి 6-8 నెలల చూడిలో ఉంటాయి.

గర్భధారణ వత్తిడి, వేసవిలోని ప్రతికూల వాతావరణ మరియు పోషణ పరిస్థితుల వల్ల వత్తిడికిలోనై సులువుగా అనారోగ్యాలకు లోనయ్యే స్థితిలో ఉంటాయి.

మేత కొరత, వానాకాలంలో చలి-చిత్తడి పరిస్థితులు, పోషకాహార లోపాలు, పరాన్న జీవుల బెడదలు తదితర కారణాల వల్ల వీటిలో మెయ్య

పశువుల సంరక్షణ

(జననేంద్రియ లోపలి భాగాలు మానం నుండి బైటకు చొచ్చుక రావడం), వృద్ధి చెందవలసిన స్థాయిలో పొదుగు వృద్ధి చెందక పోవడం,

ఈనే సమయానికి, ఆ తర్వాత శరీరంలో కాల్షియం, భాస్వరం, ఇనుము, చక్కెర వంటి ముఖ్యధాతువుల పరిమాణం క్షీణించుట వంటి కారణాల వల్ల అవి నీరసించి, పాలజ్వరం, కీటోసిస్ వంటి రోగాలకు గురికావడం జరుగుతుంది.

తొలకరిలో మన రైతులు వ్యవసాయ పనుల వత్తిడి, కూలీల కొరత వంటి సమస్యల వల్ల పశువులు, పాకల పరిశుభ్రత పట్ల అంతగా శ్రద్ధ చూపే పరిస్థితులు ఉండకపోవచ్చు.

ఈ పరిస్థితుల్లో పాకలలోని మురుగు, రొచ్చులలోని అనేక బాక్టీరియా వైరస్ బూజు తదితర క్రిములు రొమ్ము రంధ్రాలు, రొమ్ములు, పొదుగుల మీది స్వల్పగాయాలు,

పగుళ్ల ద్వారా పొదుగులలోకి ప్రవేశించి పొదుగు వాపు వ్యాధిని కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముర్రా, సాహివాల్, గిర్ వంటి భారీ పొడుగులు.

కలిగిన పశువులకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాకల నిర్మాణంలో పైకప్పు కంటే పటిష్టమైన నేలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.

నాపరాళ్ల నేలకంటే పటిష్ఠమైన సిమెంటు నేలను కొంత వాలుతో నిర్మించాలి. నాపరాళ్ల మధ్య అతుకులు కదిలినా, నాపరాళ్లు పగిలినా ఆ ఖాళీల గుండా నాపరాళ్ల క్రిందకు చేరిన మురుగులో వృద్ధి చెందే క్రిములు పశువుల ఆరోగ్యానికే కాక, పాల నాణ్యతకు కూడా తీవ్రమైన చేటును కలిగిస్తాయి.

పాకలలోకి, గాలి వెలుతురు బాగా ప్రసరిస్తే పాకలు కొంత మేరకైనా శుభ్రంగా వుండి పశువులు సుఖంగా ఆరోగ్యంగా ఉంటాయి.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

తొలకరి ప్రారంభంలోనే పశువులన్నింటిని ఆయా ప్రాంతాలలో ఉనికిలో ఉన్న దొమ్మ, గురక, జబ్బవాపు, ఐ.బి.ఆర్, గాలికుంటు, థెయిలీరియాసిస్ తదితర వ్యాధుల నివారణకు టీకాలు వేయించాలి.

ఒక మంద లేదా గ్రామంలోని కనీసం 90 శాతం పశువులకు ఈ టీకాలు వేయిస్తే కలిగే హర్డ్ (మంద) ఇమ్యూనిటీ వల్ల పశువులు ఎక్కువ రోజులు వ్యాధి నిరోధక శక్తితో ఉండగలవు.

పశువులలో కుందేటి వెర్రి, ఎర్రమూత్ర వ్యాధి, థెయిలీరియా వ్యాధి క్రిముల వ్యాప్తికి దోహదపడే జోరీగలు, పిడుదులు, దోమలు, గోమార్లు చిత్తడి వాతావరణంలోనే..

ఎక్కువగా వృద్ధి చెందుతాయి కాబట్టి పశువుల పాకలు, పరిసరాలలో ఇవి వృద్ధి చెందకుండా, ప్రాంగణాలను శుభ్రంగా, పొడిగా ఉంచుతూ..

గమాక్సీన్, డిడిటి, సున్నం, డెల్టామెథ్రిన్, సైపర్మెథ్రిన్ వంటి కీటకనాశకాలను స్ప్రే చేయడంతో పాటు అవసరమైతే పాకల చుట్టూ దోమ తెరలను ఏర్పాటు చేసి, ఈగలు, దోమల బారి నుండి పశువుల్ని సంరక్షించగల్గితే చాలా మంచిది.

మడుగులు, చెరువులు, గుంటలలో నిల్వనీటిలో వృద్ధి చెందుతూ జలగ వ్యాధి క్రిములు (ఫేసియోలాసిస్), నట్టల వ్యాప్తికి దోహదపడే నత్తల నిర్మూలనకు చర్యల్ని చేపట్టవలసిన అవసరం ఉండవచ్చు.

ఈ నీటి వనరులలో బాతుల పెంపకాన్ని ప్రోత్సహించుట సమీపంలో కుంకుడు, వేప వంటి నత్తల నిర్మూలనకు దోహదపడే చెట్లను పెంచగల్గితే మంచిది.

పశువులకు నట్టల నిర్మూలన

ఇంతేకాక ఈ బెడద వుండే ప్రాంతాలలోని జీవాల మందలు, పశువులకు నట్టల నిర్మూలనకు ఆక్సీక్లోనజైడ్ వంటి మందుల్ని పట్టించవలసి ఉంటుంది.

వాన నీటిలో గడ్డి వాములు, దాణా నిల్వలు, తడిస్తే అందులో పెరిగే బూజు సృష్టించే ఎఫ్లాటాక్సిన్స్ దూడలకు ప్రాణాంతకం, పెద్ద పశువుల ఆరోగ్యానికి, ఉత్సాదకతకు హానికరమని గ్రహించి, గడ్డివాముల్ని ఎత్తైన ప్రదేశంలో నీరు ఇంకని టార్పాలిన్ తో కప్పి సంరక్షించాలి.

పశుగ్రాస క్షేత్రాల నుండి అదనపు నీరు తరలిపోవుటకు కాల్వలను ఏర్పాటు చేస్తే ఆ మేతలు కుళ్లిపోకుండా ఉంటాయి.

ఎడతెగని వర్షాలు వరుసగా అనేక రోజుల పాటు కొనసాగినప్పుడు మేతల కొరత తీవ్రం కావచ్చును. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కనీసం..

10-15 రోజులకు అవసరమయ్యే మేత నిల్వలను ఉంచుకోవాలి, లేదా ప్రత్యామ్నాయంగా అజొల్లా సాగును, హైడ్రోపోనిక్ గ్రాసాల సాగును పాకలు,

భవనాలు నిర్మాణాలలోనూ మిద్దెల మీద కూడా చేపట్టి విపత్తు రోజుల్లో కూడా నాణ్యమైన, పుష్ఠివంతమైన మేతల్ని పశువులకు అందించి వాటిని కాపాడవచ్చును.

మామిడి, నేరేడు, మారేడు, వేప, గుర్రపుడెక్క అరటి ఆకులు సైతం తగిన పరిమితులకు లోబడి అంటే ఏ ఒక్కటి 25-30 శాతానికి మించకుండా మేపితే కూడా పశువులకు మంచిదే! అవిసె, మునగ ఆకులు దూడలకు చాలా శ్రేష్ఠం.

వానాకాలంలోనే దూడలకు, పెద్ద పశువులకు అంతర్గత పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి పేడ పరీక్షలు జరిపించి,

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

అవసరమైన ఆల్బండజోల్, ఫెన్బెండజోల్ లేదా ఆక్సీక్లోనజైడ్ వంటి మందుల్ని లేదా, గాడిదగరప, వేప, తులసి, దానిమ్మ బెరడు, పొట్ల ఆకు, కలబంద గుజ్జు వంటి ..

వాటిని కూడా మిశ్రమంగా 20 రోజుల వ్యధిలో 50 నుండి 150 గ్రాముల వరకు బెల్లంతో కలిపి తినిపించవచ్చును.

వరదల సమయంలో మురుగునీటితో త్రాగునీరు కలుషితమై పశువుల ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడవచ్చు.

మరిగించిన నీటిని కాకపోయినా, కనీసం పటిక లేదా చిల్ల (ఇండుప) గింజ, మునగ గింజల పొడితో తేట పరచిన నీటిని మాత్రమే పశువులు త్రాగుటకు అందుబాటులో ఉంచాలి.

వరదలు, తుపాన్లు, పెనుగాలులు, గాలివానల బీభత్స పరిస్థితుల నుండి పశుసంపదను కాపాడుటకు ముందుగానే ఎత్తైన (ప్రదేశాలకు ప్రదేశాలకు తరలించాలి.

విపత్తు సమయంలో పాకలలో బంధించబడిన పశువుల్ని సులువగా వేగంగా విడుదల చేయుటకు వీలుగా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

ప్రకృతి బీభత్సాల వల్ల పశుసంపదకు జరిగే నష్టాలకు పరిహారం పొందుటకు వేసవికి ముందే ప్రభుత్వాలు, పాల డెయిరీలు అందిస్తున్న ప్రీమియం సబ్సిడీని పొందుతూ..

పశువులన్నింటికీ బీమా చేయించుకోవాలనీ, బీమా కంపెనీ వారు బిగించిన చెవి పోగులు ఊడిపోకుండా జాగ్రత్త వహిస్తూ,

అవి పోతే వెంటనే బీమా కంపెనీ వారికి పోగు పోయిన విషయాన్ని వ్రాత పూర్వకంగా తెలియపరచాలి. వరదల్లో తప్పిపోయిన,

పోలీసులకు ఫిర్యాదు

దొంగిలించబడిన పశువుల్ని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయుటకు ఈ గుర్తింపు చెవిపోగుల మీది నెంబర్లు సాయపడతాయి.

డా .యం,వీ,జి, అహోబిల రావు – హైదరాబాద్ 93930 55611

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top