బీజేపీ కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షునిగా ” బిజ్జం సుబ్బారెడ్డి” ఎంపికఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర అధినాయకత్వం వివిధ మోర్చాలకు జిల్లా అధ్యక్షుల నియామకం చేప ట్టింది. అందులో భాగంగా రాష్ట్ర అధినాయకత్వం సూచన మేరకు, బీజేపీ కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా బిజ్జం సుబ్బారెడ్డిని నియమించారు.ఈ సందర్భంగా బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ ” బిజ్జం సుబ్బారెడ్డి” భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ‘ క్రియా శీలక సభ్యుడిగా ఉన్నారని, గతంతో ఉమ్మడి జిల్లాలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ, అదనంగా శ్రీశైలం అసెంబ్లీలో సభ్యత్వం నమోదు ఇంఛార్జిగా, జిల్లా కార్యదర్శిగా ఉంటూ అదనంగా ఆళ్లగడ్డ ఇంచార్జిగా, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారన్నారు. అనంతరం నంద్యాల జిల్లా ఏర్పడిన తరువాత కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ, అదనంగా అన్నమయ్య జిల్లా ఇంచార్జిగా మరియు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా అనేక పదవులను చేపట్టిన అనుభవం ఉందన్నారు.అలాగే బిజ్జం సుబ్బారెడ్డి బండిఅత్మకూరు మండలంలో గత 30ఏళ్లుగా ప్రవేట్ విద్యాసంస్థలు నడుపుతూ అక్కడి ప్రజల్లో మమేకమై, సామాజికంగా మంచి ఖ్యాతి సాధించారు. ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించారు. ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ, జిల్లాలో ప్రవేట్ స్కూల్స్ సమస్యలను ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి, అసోసియేషన్ బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తూ సభ్యుల మన్ననలు పొందుతున్నారు.అంతేకాకుండా క్రీడాభారతి విభాగంలో జిల్లా ఉపాధ్యక్షులుగా మరియు ఆత్మకూరు డివిజన్ అధ్యక్షులుగా కొనసాగుతూ క్రీడాభివృద్ధిలో కృషిచేస్తున్నారు. ఆయన స్వంత మండలంలో వికలాంగుల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉంటూ, వికలాంగులు మండల కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చి వేచిఉండాల్సి వేస్తే, సేద తీరేందుకు తన వంతు ఆర్థిక సహకారంతో ఒక ఆఫిస్ ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైన మేరకు తోడ్పాటును అందిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, జనవిజ్ఞాన వేదిక (సైన్స్) సభ్యుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి ప్రభుత్వంలో ఎంపీ తో మరియు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మరియు జిల్లాలోని ఆఫీసర్స్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని రైతులతో మంచి పట్టు ఉంది అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కల్పించి, ఎంపిక చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్, రాష్ట్ర సంఘం కార్యదర్శి మధుకర్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురు పాటి కుమార స్వామి, జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు లకు మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.
బీజేపీ కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షునిగా ” బిజ్జం సుబ్బారెడ్డి”

Partha saradi reddy bjp morcha nandyala di










