లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
త్వరలో జరిగే పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచన లిచ్చారు .
గత పంచాయతీ ఎన్నికల అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న తీరును అధి కారులు సీఎం రేవంత్‌కు వివరించారు.
ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని దానిపై ఆలోచిస్తున్నారు.
అందుకు ఎంత సమయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కర్ణాటకలో 2015 లో, బిహార్‌లో 2023లో కుల గణన చేశారని,
ఆంధ్రప్రదేశ్‌లో కుల గణన చేసిన వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క,
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర మాజీ మంత్రి కె.జానారెడ్డి,
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కలెక్టర్లతో సమావేశం
కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని సీఎం గుర్తు చేశారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఎన్నికల కోడ్ ముగియ గానే పార దర్శకంగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించామన్న ఆయన, ప్రభుత్వానికి కళ్లు, చెవులు జిల్లా పాలనాధికారులేనని
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్య మైతేనే ప్రజలకు సరైన సేవలు అందించ గలుగుతారని సూచించారు.
తెలంగాణ ను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ..
మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని కలెక్టర్ల కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ మాదిరిగా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పని చేయాలని అన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకూ ఎలాంటి సంతృప్తి ఉండదన్న ఆయన,
మీ ప్రతి చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు.