బనగానపల్లి పట్టణం కొండపేటలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులతో మూడు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం…..
రాజకీయాలకతీతంగా ఆలయ జీర్ణోద్ధరణ కమిటీ త్వరలో ఏర్పాటు చేస్తాం….
బనగానపల్లె హిందూ ప్రజలకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ప్రత్యేకంగా పునర్నిర్మిస్తాం…..
బనగానపల్లె పట్టణ ప్రజల సహాయ సహకారాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్దే నా ధ్యేయం…. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
బనగానపల్లె పట్టణం కొండపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పెద్దలు, ఆలయ పూజారి పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పట్టణ పుర ప్రముఖులతో కలిసి పరిశీలించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బనగానపల్లె పట్టణానికి చెందిన ప్రముఖులతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలోని పెద్దలు రాజకీయాలు అతీతంగా, కులాలకు అతీతంగా ఆలయ జీర్ణోధరణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఆలయ పునర్నిర్మానంలో బనగానపల్లె పట్టణానికి చెందిన హిందూ సోదరులంతా కలిసి కట్టుగా ఆలయ అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు. అనంతరం బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్యులు శాలువా కప్పి పూలమాలలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారిని సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం కొండపేటలో గల అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం శిథిలావస్థకు చేరుకోవడం తో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మొన్న యాగంటి లో నిర్వహించిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై .వి సుబ్బారెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి ఆలయ శిథిలా వ్యవస్థ గురించి తెలపడం జరిగిందని చెప్పారు. అందుకు వెంటనే టీటీడీ చైర్మన్, టిటిడి కార్యనిర్వహణాధికారులు వెంటనే టిటిడి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామని చైర్మన్ , ఈఓ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ను సందర్శించి బనగానపల్లె పట్టణ పుర ప్రముఖులతో ఆలయ అభివృద్ధి గురించి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

ముందుగా ఆలయ జీర్నోద్దరణ కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఆ కమిటీ ద్వారా ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఆలయ జీర్ణోధరణ కమిటీ లో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకోవాలని పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సూచించారు. జీర్ణోద్ధరణ కమిటీ ద్వారా భక్తుల దాతల సహకారంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పునర్ వైభవం తీసుకురావడం జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కాటసాని తిరుపాల్ రెడ్డి, దొనపాటి యాగంటి రెడ్డి, గాలి మద్దిలేటి రెడ్డి, నాగిరెడ్డి, గాండ్ల శ్రీనివాసులు, డాక్టర్ రవికుమార్, లాయర్ మాధవరెడ్డి, లాయర్ జగన్నాథరెడ్డి, గాదంశెట్టి వేణుగోపాల్, నూకల విజయ్ కుమార్,కాపులపల్లే తులసి రెడ్డి, లాయర్ నాగేశ్వర్ రెడ్డి, పసుపల సుబ్బ సత్యనారాయణ శెట్టి, భానుముక్కల పరపతి సంఘం నీలి శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకటసుబ్బయ్య, పోలూరు కృష్ణ, కుమ్మరి సురేష్ బాబు, కిషోర్ కుమార్, గంగాధర్ రెడ్డి, డాక్యుమెంటర్ మధు, కేతేపల్లి శివచంద్రయ్య, వెంకట్రామిరెడ్డి, కూరగాయల మార్కెట్ శేఖర్, సుబ్రమణ్యం, బనగానపల్లె పట్టణ పెద్దలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.