నంద్యాల జిల్లా.
బనగానపల్లె నియోజకవర్గం.
ఈ నెల 5 వ తేదీన కర్నూల్ లో JAC ఆధ్వర్యం లో జరిగే “రాయల సీమ గర్జన” కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయండి …..ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
రాయలసీమ ప్రాంత వెనుకబాటు తనం ఇంకా ఎన్నాళ్ళు…..
రాయల సీమ ప్రాంతం ఎప్పుడు అన్యాయానికి గురి అవుతునే వుంది….ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయల సీమ ప్రాంతానికి రాజధాని ఏర్పాటు చేయాలి ……
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జరిగిన తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకూడదు….ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి…..ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు
కర్నూల్ న్యాయ రాజధాని,పరిపాలన రాజధాని విశాఖ,అమరావతి శాసన రాజధానిగా రాష్ట్ర ప్రజలకు పరిపాలన సౌలభ్యం …..
బనగానపల్లె పట్టణం బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెల 5 వ తేదీన కర్నూల్ STBC కళాశాల మైదానం లో JAC ఆధ్వర్యం లో నిర్వహించబోయే రాయలసీమ గర్జన కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో ప్రజలు,మేధావులు,ప్రజా సంఘాలు,ఉద్యోగ,ఉపాధ్యాయ,విద్యార్థి సంఘాల నాయకులు,సభ్యులు,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.
అనంతరం రాయలసీమ గర్జన గోడ పత్రికలను అవిష్కరించారు.5 వ తేదీన బనగానపల్లె పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు ఉదయం 7-00 గంటలకు బనగానపల్లె నియోజకవర్గం లోని ప్రజలందరూ హాజరు కావాలని అక్కడి నుంచి భారీ ర్యాలీగా వాహనాలలో ప్రజలు రాయలసీమ గర్జన బహిరంగ సభకు హాజరు అవుతారు అని చెప్పారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ
1937 సంవత్సరం నవంబర్ 16 వ తేదీ న ఉమ్మడి మదరాసు రాష్ట్రం లో కాశీనాధుని నాగేశ్వర రావు నివాసం లో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు..
ఆ ఒప్పంద సమావేశం లో కడప కోటి రెడ్డి,కల్లూరు సుబ్బారావు తో పాటు మరికొంత మంది పెద్దలు ఒక ఒడంబడిక చేసుకొని సంతకాలు చేసుకోవడం జరిగిందని చెప్పారు.మద్రాస్ ప్రెసిడెన్సీ లో కల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అప్పటి పరిస్థితుల్లో కర్నూల్ రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ఒక నినాదం ముందుకు రావడం జరిగిందని చెప్పారు.అయితే హైదరాబాద్ రాజధానిగా తరలి వెళ్లడం జరిగింది.అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలందరూ హైదారాబాద్ రాజధానిలో పెట్టుబడులు పెట్టడం అందరూ కలిసి హైదరాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగింది.
అయితే పార్లమెంట్ సాక్షిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ ను విడిచిపెట్టి వచ్చిన అనంతరం నూతన ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్య మంత్రి అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే తప్పును చేయడం జరిగిందని అమరావతి గా రాజధానిగా నిర్ణయించి అన్ని అక్కడే అభివృద్ధి చేయాలని అనుకోవడం మళ్ళీ రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రజలు భవిష్యత్ లో నష్టపోవడం జరుగుతుందని ఆనాడే ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని అయితే అమరావతి చుట్టూ తన అనునాయులు లాండ్ పుల్లింగ్ ద్వారా భూములు కొనుగోలు చేయడం జరిగిందని తన వర్గీయుల కొరకు అమరావతి రాజధాని అని ప్రకటించడం జరిగిందని చెప్పారు.ఆ తరువాత 2019 లో ముఖ్య మంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ తరహాలో రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రజలు మళ్ళీ మోసపోకుడదు అని ఉద్దేశ్యం తోనే మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నే పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే మహా సంకల్పంతో మూడు రాజధానులు ప్రకటించడం జరిగిందని అయితే అప్పటికే అమరావతి చుట్టూ అప్పటికే టీడీపీ పార్టీ నాయకుల బినామీల కబంధ హస్తాల్లో వుండడం తో మూడు ప్రాంతాల అభివృద్ధి కు టీడీపీ పార్టీ లతో పాటు అక్కడ లబ్దిపొందిన పార్టీల ప్రతినిధులు అందరూ వ్యతిరేకించడం జరిగిందని చెప్పారు.అయితే అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యం తో పరిపాలన వికేంద్రీకరణ కు వైయస్సార్ పార్టీ పూర్తిగా కట్టుబడి వుందని చెప్పారు.ఈ కార్యక్రమం లో వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.