రాయలసీమ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన MLA కాటసాని

criket-tornament-mla-katasani-ramireddy-www-politicalhunter-com.jpg

బనగానపల్లె పట్టణ హై స్కూల్ గ్రౌండ్ లో స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రాయలసీమ జోనల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన..బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, కాటసాని ఓబుల్ రెడ్డి గారు, కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు.

బనగానపల్లె పట్టణ గ్రౌండ్ ను చూసి క్రికెట్ అభిమానులు ఈరోజు నిజంగా గర్వపడతారు…..కాటసాని ఓబుల్ రెడ్డి గారు

స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ సంతోషపడుతుంది…..కాటసాని ఓబుల్ రెడ్డి గారు

ఈరోజు మా బావగారికి గుర్తుగా రాయలసీమ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది…. కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు (MLA కోడలు)

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క కీడాకారుడు ను వెలికితీయాలన్నదే ఈ పోటీల లక్ష్యం…… కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు

ప్రతి క్రీడాకారుడు ఆటలో గెలుపు- ఓటములను సమానంగా తీసుకోవాలి…..క్రీడాకారులందరికి శుభాభినందనములు….. కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు..

బనగానపల్లె పట్టణం హై స్కూల్ గ్రౌండ్ లో రాయలసీమ జోనల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోనల్ పోటీలను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, కాటసాని ఓబుల్ రెడ్డి గారు కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు ప్రారంభించారు. బనగానపల్లె పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి గ్రేస్ బాల్ తో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి అని ఈ టోర్నమెంట్ కు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 50 టీమ్ లు ఎంట్రీ చేసుకోవడం జరిగిందని చెప్పారు. ముందుగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారిని కాటసాని ఓబుల్ రెడ్డి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మేళ,తాళాలతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం క్రికెట్ టోర్నమెంటును రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ముందుగా కాటసాని రామిరెడ్డి గారు బ్యాటింగ్, కాటసాని ఓబుల్ రెడ్డి గారు బౌలింగ్ వేసి క్రీడాకారులందరికి ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించారు. ఈ రాయలసీమ జోనల్ స్థాయి గ్రేస్ బాల్ టోర్నమెంటుకు మొదటి బహుమతిగా 1,00,000 లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 50,000 వేల రూపాయలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తన సొంత నిధులతో బహుమతులు ఏర్పాటు చేశారు.

katasani medhasri reddy

ఈ సందర్భంగా కాటసాని మేధాశ్రీ రెడ్డి గారు మాట్లాడుతూ తన బావగారి పేరు మీద ఈరోజు రాయలసీమ స్థాయి జోనల్ క్రికెట్ పోటీలను నిర్వహించడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారున్ని వెలికి తీయాలని లక్ష్యంతోనే తన భర్తగారైన కాటసాని ఓబుల్ రెడ్డి గారు రాయలసీమ స్థాయి జోనల్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తన బావ గారి పేరు మీద స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో టోర్నమెంట్లను నిర్వహిస్తామని చెప్పారు. క్రీడాకారుడు కూడా ఆటలో గెలుపు- ఓటములను సమానంగా తీసుకోవాలని క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిని అందించారు. గత 30 సంవత్సరాలుగా గ్రేస్ బాల్ టోర్నమెంట్ బనగానపల్లె పట్టణంలో జరగలేదని ఈరోజు గ్రేస్ బాల్ టోర్నమెంట్ ను తన భర్త గారు కాటసాని ఓబుల్ రెడ్డి గారు నిర్వహించడం తనకి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి శుభాభివందనంలు తెలిపారు.

ఈ సందర్భంగా బనగానపల్లె మండలం వైయస్సార్ పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఈ హై స్కూల్ గ్రౌండ్ ఆధునీకరణను చూస్తే హైదరాబాద్ సిటీలోని జింఖానా గ్రౌండు గుర్తుకు వస్తుందని చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువ క్రీడాకారుల ప్రావిణ్యతను వెలికితీయాలన్నదే కాటసాని ఓబుల్ రెడ్డి గారి లక్ష్యం అని అందుకే తన సొంత నిధులతో హై స్కూల్ గ్రౌండ్ ను ఆధునికరించడం జరిగిందని తెలిపారు.

వైఎస్ఆర్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ గారు మాట్లాడుతూ కాటసాని ఓబుల్ రెడ్డి గారు గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి యువకుల్లో క్రీడల పట్ల ఒక చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అందుకోసం స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. యువ ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు అని చెప్పారు.

బనగానపల్లె పట్టణ సీనియర్ సిటిజన్ షటిల్ క్రీడాకారుడు శ్రీరాములు గారు మాట్లాడుతూ తాము షటిల్ ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అప్పటి – ఇప్పటి శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఎంపీ గారి నిధులతో 40 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియం ను ఏర్పాటు చేసి షటిల్ క్రీడాకారులకు అందించడం జరిగిందని చెప్పారు. కాటసాని కుటుంబం ఎప్పుడూ కూడా క్రీడల పట్ల మక్కువ చూపిస్తూ వస్తూ ఉండడం తనకెంతో సంతోషంగా ఉందని స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో టోర్నమెంట్లను నిర్వహించాలని తాను కోరుకుంటున్నాను అని చెప్పారు.

katasani obul reddy

ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ ను ప్రేమించేవారు ఈరోజు ఈ రాయలసీమ జోనల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను చూసి చాలా గర్వపడతారని చెప్పారు. మా అన్నగారు స్వర్గీయ నాగార్జున రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ సంతోషపడుతుందని చెప్పారు. కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా ముందు ముందు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తామని తెలిపారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక ప్రాధాన్యత తమ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. క్రీడాకారులకు గెలుపు ఓటములు అనేది సహజం కాబట్టి క్రీడాఫూర్తితో గెలుపు ఓటములను క్రీడాకారులు స్వీకరించాలని చెప్పారు.

Mla katasani ramireddy

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు తన పెద్ద కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి గారి జ్ఞాపకార్థం రాయలసీమ జోనల్ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 1,00,000 లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 50,000 వేల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పారు. వర్షాకాలంలో వర్షపు నీరుతో హై స్కూల్ గ్రౌండ్ మొత్తం నిండిపోయి వాకర్స్ కు చాలా ఇబ్బందిగా ఉండేదని అయితే తన సొంత ఖర్చులతో ఈరోజు ఈ హై స్కూల్ గ్రౌండ్ ను ఆధునికరించడం జరిగిందని అయితే ఈ గ్రౌండ్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్ ను కాటసాని ఓబుల్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఈ గ్రౌండ్ ను అధునికరించడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. క్రీడలు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అని అందులో భాగంగానే వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని ఈ మధ్యనే నియోజకవర్గం స్థాయిలో వివిధ క్రీడల టోర్నమెంట్లు నిర్వహించడం జరిగిందని చెప్పారు. కాటసాని ఓబుల్ రెడ్డి కూడా రాయలసీమ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రాయలసీమ జోనల్ స్థాయి పోటీలకు 50 టీములు ఎంట్రీ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ,ఈ టోర్నమెంట్ లో ఎక్కడ కూడా ప్రాంతీయ వివక్ష లేకుండా నిర్వహించాలని నిర్వాహకులకు అటు అంపేర్లకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా, సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రామకృష్ణ ,మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, యాగంటి దేవస్థానం పాలకమండలి చైర్మన్ తోట బుచ్చిరెడ్డి ,వార్డు మెంబర్ సురేష్, సీనియర్ సిటిజన్ షటిల్ క్రీడాకారుడు శ్రీరాములు ,వైయస్సార్ పార్టీ నాయకులు బండి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగుడి సుబ్బారెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి యూత్ సభ్యులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top