మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పెరట్లో వికసించిన బ్రహ్మ కమలాల జంట – ఆయుర్వేదానికి మంచి ఔషదం బ్రహ్మకమలం
హిమాలయాలలో పర్వతాల్లోనే కనిపించే బ్రహ్మకమలం .. ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణం లోని తెలుగుదేశం పార్టీ మాజీ MLA బిసి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద పెరట్లో జంట బ్రహ్మ కమలం పువ్వు వికసించడంతో సంతోశం వ్యక్తం చేశారు .. ఆయన సతీమణి ఆంద్రప్రదేశ్ థాయి బాక్సింగ్ ఛైర్మన్ బీసి ఇందిరమ్మకు సంతోషం కట్టలు తెంచుకుంది . ఆనందంతో చుట్టుప్రక్కల వారికి విషయం చెప్పింది . అందందాన్ని పంచుకుంది.
21-12-2022 తేదీ మంగళవారం నాడు రాత్రి బ్రహ్మ కమలాలు జంటగా పుష్పించాయి. ఈ విషయాన్ని గమనించిన బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరా రెడ్డి కాలనీ వాసులకు తెలియజేయడంతో వారందరూ అక్కడికి చేరుకుని ఈ యొక్క జంట బ్రహ్మ కమలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ ఇందిరా రెడ్డి మరియు వారి స్నేహితులు మాట్లాడుతూ.. ఈ బ్రహ్మ కమలం మొక్కను గత ఆరునెల క్రితం తీసుకొని వచ్చి ఒక తొట్టిలో ఇసుక ఎరువు మెత్తని మన్ను మూడు మిశ్రమం చేసి మొక్కను నాటడం జరిగిందని అన్నారు . ఈరోజు మా ఇంటి ఆవరణంలోని పెరటి నందు జంట బ్రహ్మ కమలాలు పుష్పించాయని అన్నారు.
ఈ బ్రహ్మ కమలాలు ఎక్కువగా హిమాలయాల్లో పుష్పిస్తాయని ఇతరులు చెప్తే విన్నామని కానీ ఇప్పుడు ఇలా దగ్గరుండి కళ్ళ ముందర చూడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ బ్రహ్మ కమలం మొక్క ఆయుర్వేదానికి కూడా ఉపయోగించడం జరుగుతుందని అలాగే బ్రహ్మ కమలం మొక్క ఆకును నీటిలో మరిగించి తాగితే క్యాన్సర్ నయమవుతుందని వినడం జరిగిందని అన్నారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ.. మా స్నేహితురాలు బీసీ ఇందిరా రెడ్డి ఇంట్లో బ్రహ్మ కమలాల జంట చూసి చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు.