విద్యుత్ రంగంపై చంద్రబాబు తీరును కాకాణి
నెల్లూరు : విద్యుత్ రంగాన్ని అప్పుల కుప్పగా చేసింది చంద్రబాబేనని.. తా జాగా ఆయన విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ అబద్దా లపత్రాలు అని
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి విమ ర్శించారు. మంగళవారం జిల్లా వైసీపీ కార్యాల యం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దాలమయమన్నారు.
శ్వేతపత్రం అంటే ఆ రంగంలో ఉన్న వాస్తవ పరిస్థితిని వివరించే పత్రమని.. చంద్రబాబు ఆ పని చేయకుండా..
జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు సమయం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.
YCP హయాంలో 4.7 శాతం వృద్ధి రేటు నమోదు
జగన్ మోహన్రెడ్డి హయాంలో విద్యుత్ రంగంలో జాతీయ సగటు కన్నా అధికంగా 4.7 శాతం వృద్ధి రేటు నమోదు అయిందని ,
చంద్రబాబు హయాంలో 1.9 శాతం మాత్రమే అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి నప్పుడు విద్యుత్ రంగ బకాయిలు 29,550 కోట్లు ఉంటే
ఆ యన దిగిపోయే నాటికి ఆ బకాయిలు 86,215 కోట్లకు చేరుకుని డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూ రుకు పోయాయన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను పట్టిం చుకో “కుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నా రన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు తగ్గుముఖం పడితే
రాష్ట్రంలో మాత్రం యూనిటు రూ .7లకు కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసు కోవడంతో ఎంతో నష్టం జరిగిందన్నారు.
రైతులకు సం బంధించి సబ్సిడీ బకాయిలు కూడా విద్యుత్ సంస్థలకు చంద్రబాబు చెల్లించలేదన్నారు.
జగన్మోహన్రెడ్డి అధి కారంలోకి వచ్చిన తరువాత వాటిని చెల్లించి విద్యుత్ వినియోగదారులపై, రైతులపై భారం పడకుండా చేశా రన్నారు.
ట్రూఅప్ ఛార్జీల పెంపు చంద్రబాబు పాపమే
ట్రూఅప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని, కానీ తనకేమీ తెలియనట్లే చంద్రబాబు మా ట్లాడారన్నారు.
రైతులకు మీటర్లను పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని, తా జాగా ఆయన ఈ విషయం ప్రస్తావించకుండా దాట వేశారన్నారు.
రైతులకు మీటర్లపై చంద్రబాబు స్పందించాలి
ఎన్నికలకు ముందుకు మీటర్లు ఉరితాళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడైనా స్పందించాలని డిమాండ్ చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు శ్వేతపత్రం అంటే ఇతరులను విమర్శించడం సరి కాదన్న విషయం తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగం నష్టాలకు కారణం చంద్రబాబు విధానాలే తప్ప జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
చంద్రబాబు వరుస శ్వేత పత్రాలు
ఏపీలో గత ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలు ఎలా నష్టపోయాయో ప్రజలకు వివరించేందుకు సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు.
వైసీపీని ఇరుకున పెడుతున్న చంద్ర బాబు నాయుడు
ఈ క్రమంలో ఇవాళ విద్యుత్ రంగ తాజా పరిస్ధితిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేసారు.ఇందులో గత వైసీపీ విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని తప్పుపట్టారు ..Alsoread