జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి..
పత్తికొండ నియోజకవర్గం లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పక్కిరప్పపై 22-10-2022 శనివారంనాడు దుండగులు దాడి చేయడం జరిగినది.
ఈ దాడి ఘటనను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణం లో జర్నలిస్టులు ధర్నా నిర్వ హించారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
దాడికి నిరసనగా ఆత్మకూరు పట్టణంలో జర్నలిస్టు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, విలేఖరి పై దాడి చేసిన..
దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నిరసిస్తూ..ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయానికి చేరుకున్నారు.. అనంతరం ఆర్డిఓ వెంకటదాసు కు..
దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వానికి నివేదించాలని వినతి పత్రం సమర్పించారు…
RDO వెంకటదాస్ స్పందిస్తూ ఇచ్చిన పిర్యాదును నంద్యాల జిల్లా కలెక్లికలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నిరసనలో ఆత్మకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.