లబ్బిదారులకు పెన్షన్ వచ్చే విధంగా సచివాలయ ఉద్యోగులు కష్టపడండి.. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా
సోమవారం చైర్మన్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లతో పెన్షన్ల సమావేశం
అర్హత ఉన్న లబ్ధిదారులకు తప్పనిసరిగా వైయస్సార్ పెన్షన్ ఇవ్వాల్సిందే – మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ రషీద్
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెన్షన్ వస్తు మధ్యలోనే నిలిచిపోయిన అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్ వచ్చే విధంగా మున్సిపల్ సచివాలయ అడ్మిన్లు సెక్రెటరీ వెల్ఫేర్ ఉద్యోగులు లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేసే విధంగా కృషి చేయాలని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా కో ఆప్షన్ సభ్యులు ఎంఏ రషీద్ పేర్కొన్నారు.. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సచివాలయ అడ్మిన్ల సెక్రెటరీ వెల్ఫేర్ ఉద్యోగుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉండి ఆన్లైన్లో జరిగిన టెక్నికల్ ఇబ్బందులతో పొలాలు ఇళ్ల కొలతల తప్పులను సరిచేసి అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ తీసేసిన వారికి తిరిగి పెన్షన్ అమలు చేసే విధంగా సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని తెలియజేశారు పట్టణంలో అర్హులైన పెన్షన్ దారుల కు 415 పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు తొలగిపోవడం జరిగిందని సూచించారు పెన్షన్ తీసుకుంటున్న బాధితులకు న్యాయం చేసే విధంగా మరోసారి సమగ్ర విచారణ చేసి పెన్షన్ అందించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ పథకాన్ని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో వైయస్సార్ పెన్షన్ తీసుకుంటున్న ఏ ఒక్క లబ్ధిదారైనా నష్టపోకుండా మరోసారి పేదలైన వృద్ధులు వితంతువులు వికలాంగుల కోసం కష్టపడాల్సిన పరిస్థితి సచివాలయ సెక్రెటరీ వెల్ఫేర్ ఉద్యోగులపై ఉందని తెలిపారు వైసిపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రాకుండా సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా రెండోసారిగా పొలాలు ద్విచక్ర వాహనాలు ఇళ్ల స్థలాలు మరియు ఇతర వాటిపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాకుండా అన్ని విధాలుగా ముందుకెళ్లాలని తెలియజేశారు…ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర్ గౌడ్ రాంప్రసాద్ సచివాలయ సెక్రెటరీ వెల్ఫేర్ అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు.