కూరగాయల మార్కెటా లేకపోతే పశువుల మార్కెటా?
అధికారులకు సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ సూటి ప్రశ్న
ఆత్మకూరు పట్టణంలో వున్నది కూరగాయల మార్కెటా లేకపోతే పశువుల మార్కెటా చెప్పాలని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అధికారులను సూటిగా ప్రశ్నించారు. అనంతరం ఆత్మకూరు పట్టణం గాలి రవిరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మోడల్ సంతలని చెప్పి వ్యాపారుల ఆశలను కలగానే మిగిల్చారని నూతన హామీని విస్మరించిందని కానీ ప్రభుత్వాలు మారిన వ్యాపారులకు ప్రజలకు అవస్థలు పడుతున్నారని వారు విమర్శించారు.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
మార్కెట్ సంతలలో ఎడాదికి ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం వున్న మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమైయ్యారన్నారు ఇక్కడ సుమారు కొన్ని ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు దెబ్బతిని వర్షాకాలంలో ఇక్కడి వ్యాపారుల కూరగాయలు తడిసి పోతున్నాయని అలాంటప్పుడు అక్కడ వ్యాపారాలు ఎలా చేసుకోవాలని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు ఇక్కడ వ్యాపారులకు అనుగుణంగా అరుగులు ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు గతంలో వేసిన సిమెంట్ బెడ్లు దెబ్బతిని వర్షం వస్తే అమ్మకాలు బురదలో జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.
మార్కెట్ కు మూడు చోట్ల గేట్లు కూడా సరిగలేవని దానివలన మార్కెట్ లోకి పశువులు చేరి అపరిశుభ్రంగా చేస్తూ అక్కడికి వచ్చే వినియోగధారులపైన వ్యాపారులపైన దాడులు జరిగిన సందర్బలు కూడా వున్నాయని వారు గుర్తు చేశారు.
మార్కెట్ కు వచ్చే వినియోగధారులకు ప్రజలకు మూత్రశాలలు కానీ త్రాగునిటీ సౌకర్యాలు రాత్రిపూట వచ్చే వ్యాపారులకు విద్యుత్ దీపాలు లేకపోవడం తో ఆకతాయిలకు తాగుబోతులకు అడ్డాగా మారిందని వారు ఆరోపించారు ఇకానైనా మునిసిపల్ అధికారులు గతంలో కౌన్సిల్ లో నిర్మాణం చేసిన నాలుగు కోట్ల రూపాయలతో మార్కెట్ ను అభివృద్ధి చెయ్యాలని వారు డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం లో వున్న స్థానిక ఎమ్మెల్యే గారైన చొరవ తీసుకొని మార్కెట్ వ్యాపారుల ప్రజల అవస్థలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు.