ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014, లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం…
నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరిచాలి
రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
అసంపూర్ణ వాగ్దానాలను రేపటి పార్లమెంటు బడ్జెట్ సెషన్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపర్చాలి
వాటిపై ఎన్నికల ముందే చర్యలు తీసుకోవాలి
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రిక అవసరంగా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ….
అటు ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూడా ఎన్నో వాగ్దానాలను చట్టంలో పొందుపరిచింది.
కానీ పది సంవత్సరాల తర్వాత ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి తోసేస్తూ, అటు కేంద్ర, ఇటు రాష్ట్ర సర్కారులు వాగ్దానాల అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు
స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఈ రెండు అత్యంత ప్రముఖమైన వాగ్దానాలు..
సాక్షాతూ పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీని తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
దీనివలన ఆంధ్ర ప్రదేశ్ కు అన్నిరంగాల్లో తీవ్ర నష్టం కలిగింది
అలాగే పోలవరానికి జాతీయ హోదా రాష్త్ర బాగుకోసం ఎంతో అవసరం.
దీన్ని అటకెక్కించారు.
దుగరాజపట్నం పోర్ట్ రాలేదు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అమలు కాలేదు
విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఇంకా ఆచరణలోకి రాలేదు
కలహండి-బలంగీర్, బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మించాల్సి ఉంది
కొత్త రాజధాని నిర్మాణం కు సపోర్ట్ చేయాల్సి ఉంది
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలి
పార్లెమెంటు బడ్జెట్ సమావేశాల్లోని రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరిచాలి….🙏🙏🙏