హైడ్రో పవర్ ప్రాజెక్టు పై 28న నర్సీపట్నం వస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు ప్రకటన చేయాలని డిమాండ్
28న నర్సీపట్నం వస్తున్న ఏపీ సీఎం జగన్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై రద్దు పై ప్రకటన చేసి అడవులు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజయ్ తో కలిసి ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో ఎర్రవరంలో సమీక్షించారు. అనంతరం చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ చింతపల్లి,కొయ్యూరు సరిహద్దు ప్రాంతమైన ఎర్రవరం హైడ్రోపవర్ ప్రాజెక్టుపై గిరిజనులు తమ హక్కుల్ని అడవుల్ని కాపాడుకుంటూ పోరాటం చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అని అన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు ప్రాంతం అటవీ ప్రాంతం అయినందున గిరిజనులకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం అపోహ కల్పిస్తుందని 5వ షెడ్యూలు ప్రాంతమంతా గిరిజనుల ప్రాంతమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గిరిజనులకే హక్కు తప్ప మరి ఏ ప్రభుత్వానికి హక్కు లేదన్న విషయాన్ని 1995లో అనంతగిరి మండలం ఒక గ్రానైట్ క్వారీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చదవాలని సూచించారు. బాక్సైట్ విషయంలో 97 జీవో రద్దు చేశామని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు గిరిజన ప్రాంతం కాదా! అని ప్రశ్నించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం వ్యతిరేకమైనదని గిరిజన సలహా మండల్లో ఆమోదం జరిగిందా లేదా అని, జరిగితే గవర్నర్ ఆమోదం పొందాలని ఇన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరింత గిరిజన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే కాకుండా అనంతగిరి మండలంలో రెండు ప్రాజెక్టులు విజయనగరంలో ఒక ప్రాజెక్టు ఉన్నాయని మొత్తం అంతా గిరిజన ప్రాంతమే నాశనమవుతుందని అన్నారు. 28న నర్సీపట్నం వస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు బాధితుల యొక్క సమస్య వినతి పత్రం రూపంలో ఇవ్వటానికి సమయం కల్పించాలని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత గిరిజన గ్రామాల ప్రతినిధులు బాలన్న, చినరాజు,బెన్నస్వామి,మంగరాజు,రాజు,ఇతర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.