వైసిపి బీసీలను కరేపాకులా వాడుకుంటుంది – ఆదోని TTP నాయాకుల ఎద్దేవా

idemi-kharma-mana-rashtaniki-tdp-adoni.jpg

తెలుగు రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ బీసీ అధ్యక్షులుగా ప్రకటించిన చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీదే
వైసిపి చరిత్ర అగ్రవర్ణాల చరిత్ర మీది కేవలం బీసీలను కరేపాకు లాగా వాడుకుంటున్న వైసిపి ప్రభుత్వం

ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు ఇదేం ఖర్మ మన రాష్టానికి కార్యక్రమంలో ఆవేదన

తెలుగుదేశం పార్టీ వెనకబడిన బీసీ కులాలకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వారి సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నాం’వైసీపీ ప్రభుత్వ పెద్దలు తరచూ చెప్పే ఈ మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి. వాస్తవంలోకి వచ్చేసరికి పేరు గొప్ప ఊరు దిబ్బగా అన్నట్టుగా ఉంటుంది.అన్ని టిడిపి మాజీ ఇంచార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ కులవృత్తుల స్వయం ఉపాధికి చేస్తున్న సాయం నామమాత్రమే. ఎన్నికల ముందు ఎన్నో ఆశలు కల్పించిన వైసీపీ అధికారంలోకి రాగానే మరచిపోయింది. గత టీడీపీ హయాంలో అందుతున్న ప్రయోజనాలను రద్దు చేసింది. నవరత్నాల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాయీబ్రాహ్మణ.యాదవ, రజక, చేనేత వృత్తి కులాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న రజక, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పనిముట్లను నిలిపేసి, వారి స్వయం ఉపాధి పథకాలను ఎత్తేసిందని అన్నారు.గౌడ, అగ్నికుల క్షత్రియ కులాలకు కూడా గతంలో అందుతున్న పలు పథకాలను రద్దు చేశారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్‌… బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శిస్తున్నారు.

యాదవుల కు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదు

రాష్ట్రంలో ఉన్న 137 బీసీ కులాల్లో యాదవులు అత్యధిక శాతం ఉన్నారు. దాదాపు 80లక్షల మంది ఉన్నట్టు ఆ వర్గంవారు చెబుతున్నారు. గతంలో యాదవులు, కురుబలకు స్వయంఉపాధి ద్వారా గొర్రెల కొనుగోలుకు రుణాలు అందించేవారు. గొర్రెల పెంపకం దారులకు ప్రత్యేకంగా సొసైటీలు ఏర్పాటు చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సహకారం అందించారు. గొర్రెలకు అవసరమైన మందులు ఈ సొసైటీకి ఉచితంగా సరఫరా చేసేవారు. చంద్రబాబు హయాంలో ప్రతి గ్రామంలో స్వయం ఉపాధి పథకాలు అందించారు. యాదవులు గొర్రెల కొనుగోలు యూనిట్లు భారీగా పొందారు. ఎన్‌బీసీఎ్‌ఫడీసీ ద్వారా బ్యాంకులు రుణాలివ్వకపోయినా ప్రభుత్వం పూచీకత్తుతో గొర్రెల కొనుగోలుకు రుణాలు అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సహకారం అందడం లేదని వాపోతున్నారు. గతంలో ఉన్న పథకాలను రద్దు చేసి నవరత్నాల్లో ఆ ప్రయోజనాలు చూసుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని చెబుతున్నారు. మాంసం అభివృద్ధి, గొర్రెల పెంపకం విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం అన్ని వర్గాలకు విస్తరించిందని, కులవృత్తిలో ఉన్న యాదవులకు ప్రత్యేకంగా కల్పిస్తున్న ప్రయోజనాలేవీ లేవంటున్నారు. కొత్తగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం తప్ప ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు.

రాష్ట్ర నాయి బ్రాహ్మణుల కోసం ఎన్టీ రామారావు గారు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు

టిడిపి రాష్ట్ర బీసీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డేమాన్ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. వారిలో 70 శాతం మంది కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ఆదరణ ద్వారా పనిముట్లు అందించి కొంతమేర ఊరట కలిగించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని వడ్డేమాన్ గోపాల్. అన్నారు . స్వయం ఉపాధి రుణాలివ్వడం ద్వారానే నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమంటున్నారు. క్షవరవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నవారికి కనీసం రూ.5 లక్షలు పూచీకత్తు లేని రుణాలిచ్చి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు . సంగీత కళాశాల ఏర్పాటుచేసినా అందులో నాదస్వరం తప్ప మరేదీ లేదంటున్నారు. హెయిర్‌ సెలూన్‌, మెన్‌ బ్యూటీపార్లర్‌ లాంటి షాపులకు ఇతర కులాలకు అనుమతిచ్చి తమ వర్గం ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఒకరిద్దరికి పదవులిచ్చి మొత్తం నాయీ బ్రాహ్మణుల కులానికి అన్యాయం చేశారు

రజక సంఘం కార్పొరేషన్ ఒక్క రూపాయి ఇవ్వని వైసిపి ప్రభుత్వం

టిడిపి సీనియర్ నాయకుడు ఫరుద్దీన్ సౌదీ రఫ్ ఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో రజకులు దుర్భర జీవితం గడుపుతున్నారు. వారిలో అత్యధిక శాతం కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో రజకులకు 90 శాతం సబ్సిడీతో ఆదరణ పనిముట్లు అందించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిలిపేశారు. గతంలో పలుచోట్ల రజకులకు రూ.10 లక్షల వ్యయంతో దోబీఘాట్లు నిర్మించారు. కులవృత్తిలో అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు ఆ పథకాలన్నింటికీ స్వస్తి పలికారు. రజక యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

చేనేత కార్మికులకు మొండి చేయి చూపిస్తున్న వైసిపి ప్రభుత్వం
ఆదోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మదిరే భాస్కర్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం కేవలం 80వేల మందికే నేతన్న నేస్తం అందిస్తోంది. నూలు వడికే వారు, రాట్నం తిప్పేవారు, రంగులద్దే వారందరూ చేనేత కార్మికులే. వారికెవరికీ సాయం అందడం లేదని ..ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధిర భాస్కర్ రెడ్డి. ఆవేదన వ్యక్తం చేస్తారు

చేనేతలకు సొంత మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు గత ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే… ఈ ప్రభుత్వం మగ్గం యజమానులకే సాయం అందిస్తోంది. పైగా వ్యవసాయ భూమి, సొంతిల్లు, విద్యుత్‌ వినియోగం తదితరాలతో పాటు నూలు కొనుగోలు బిల్లు అనే కొత్త నిబంధనతో నేతన్న నేస్తంలో కోతలు పెడుతున్నారు. జీఎస్టీ 12 శాతానికి పెంచి చేనేతల నడ్డివిరుస్తున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మానవి దేవేంద్రప్ప. రామస్వామి మాట్లాడుతూ..

గత ప్రభుత్వం నిరుపేద గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ఏటా 70కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1175 కల్లుగీత సొసైటీలకు సహకారమందించింది. సుమారు 30వేల మందికి పైగా గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాలకు చెందినవారికి రూ.25వేల నుంచి 2లక్షల వరకు రుణాలందించింది. చంద్రన్న బీమా ద్వారా ప్రమాద బీమా కల్పించింది. ఇప్పుడా పథకాలేవీ అందడం లేదు. ఈ సామాజికవర్గానికి చెందినవారు మంత్రి అయినప్పటికీ ఆ వర్గానికి పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. పేరుకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి కొంతమందికి పదవులివ్వడంతోనే ఆయా కులాల అభివృద్ధి జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వ విధానాలతో బీసీలు సంతృప్తిగా లేరని దేవేంద్రప్ప వైసీపీ ప్రభుత్వం న్ని విమర్శిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదోని మండలం మాజీ ఎంపీపీ మురళి నారాయణపురం మాజీ సర్పంచ్ కారుమంచప్ప నారాయణపురం షేక్షావలి కర్నూలు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉనూర్ మల్లేష్ టిడిపి సీనియర్ నాయకులు బిటి శ్రీనివాసులు ఎండి హుస్సేన్ రాముడు 37వ వార్డు ఇంచార్జ్ విజయకుమార్ ఆదోని పట్టణం ఎస్సీ సెల్ లీడర్ వీరేష్ పకీరప్ప శివయ్య స్వామి కర్జప్ప ఎస్సీ సెల్ నాయకులు ఆనంద్. లింగప్ప మొదలగు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top