ఆదివాసులు మానవాళికి ఆధ్యులు..
అడవికి, ప్రకృతికి, సహజ వనరులకు రక్షకులు…
సంపద, సరుకులు కేంద్రంగా కొనసాగుతున్న మన సమాజానికి భిన్నంగా శ్రమ కేంద్రంగా ఆదివాసులు జీవిస్తున్నారు.
అయితే మార్కెట్ విస్తరణ, ప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు, పాలనా పద్ధతుల వల్ల ఆదివాసుల ఉనికి సంక్షోభంలో పడిపోయింది.
ఆదివాసులు అడవి నుంచి విస్తాపనకు గురై, చివరికి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. అత్యంత ప్రాచీన సాంస్కృతిక జీవన మూలాలు ఉన్న ఆదివాసులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
నల్లమలలోని చెంచులు ఆదిమ గిరిజన తెగల్లో ద్రావిడజాతికి చెందిన ఒకానొక తెగ, చెంచుల చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. 17వ శతాబ్దంలోనే ఫెరిస్టా అనే చరిత్రకారుడు చెంచుల జీవన ప్రమాణాలపై పలు వివరాలు వెల్లడించాడు.
అయితే 1943లో హెమన్ డార్ఫ్ రాసిన పుస్తకం చెంచుల మీద ప్రామాణికమైనది. దేశంలో అత్యంత వెనకబడిన చెంచుల జనాభా నానాటికీ క్షీణిస్తున్నది.
చెంచు జాతిని సంరక్షించాలని ప్రభుత్వాలు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. నేడు అంతర్జాతీయ ఆదివాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కధనం.
అడవుల్లో చెంచుల నివాసాలను గూడేలన్ని పెంటలని అంటారు. దోమలపెంట,సున్నిపెంట,చదరం పెంట తదితర పెంటలు నల్లమలలోఉన్నాయి.
పెద్దపెంటలను గూడేలు అంటారు. గూడేలలో వ్యవసాయం కనిపిస్తే, పెంటల్లో ఇంకా అటవీ ఫలసాయ సేకరణ, వేటస్థాయిలోనే చెంచులు ఉన్నారు.
చెంచుల మాతృభాష తెలుగు అయినప్పటికీ తమదైన శైలిలో యాష, మాండలికం మిళితమై ఉంటాయి. అయితే చెంచులను బయటి ప్రపంచంతో ఎన్నో తరాలుగా పరిచయాలు ఉండటంతో వారు ఇతరులతో సులభంగానే సంభాషిస్తారు.
ఈ పెంటల్లో నేటికి ఆనారోగ్యం, పోషకాహారలోపం, ఆర్ధిక వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అయితే వారి సాంస్కృతిక వారసత్వం మాత్రం ఉన్నతస్థాయిలో వుందని చారిత్రక సాక్ష్యాలు తెలుపుతున్నాయి.
చెంచుల్లో భిన్నమైన ఆచారాలు
చెంచులది పితృస్వామిక వ్యవస్థ. కట్నకానుకలకు బదులు ఆడపిల్లకు వోలి ఇచ్చే ఆచారం వుంది. పెండ్లిలో ఆర్భాటాలు రూడా కనిపించవు.
ఉన్నంతలో అదుతూ పాడుతూ సంతోషకంగా గడుపుతారు. ఇంటిపేరు, గోత్రం పరిగణలోకి తీసుకుని ఆరుబయటే లోయ వివాహాలు చేసుకుంటారు.
చెంచుల్లో 26 గోత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్తి(అరటి), నిమ్మల (నిమ్మచెట్టు), కుడుముల (వంటకం), పులచెర్ల (పెద్దపులి), ఉడతల (ఉడత), తోకల(తోక), మేరల (మేక), ఉత్తలూర్ లాంటి ఇంటిపేర్లు ఉన్నాయి. అలాగే చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు వారి ఆదిమ సంస్కృతికి చిహ్నంగా వుంటాయి.
వారు ప్రకృతి దగ్గరగా జీవించడం వల్ల వారి ఆచారాలు కూడా ప్రకృతిలో ముడిపడివుంటాయి, పెళ్లి, చావు సందర్భాల్లో చెంచులు తమ తెగ ఇదారాలను పాటిస్తారు.
ఇదిలావుంటే చెంచుగూడేలకు తమ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఫలసాయం ఆ గూడేల వారికే హక్కు ఉండేవి. అయితే బండచెట్లు, చింతచెట్లు ఫలయాసాన్ని ఇచ్చే చెట్లన్నీ సామాజిక ఆస్తి కింద అనుభవిస్తారు కుల పంచాయతీ బలంగా వుంటుంది.
సామాజిక జీవనికి విషయాల్లో పెద్దల జోర్యం వుంటుంది. కులాచారాలు పాటించని వారికి ఇరిమానాలు విధిస్తారు. కొన్నిసార్లు నెలి వేస్తారు.
చెంచుల్లో రెండు తెగలు
చెంచుల్లో ముఖ్యంగా రెండు తెగలవారు ఉన్నారు. వారు అడవి చెంచులు, ఊరచెంచులు, నల్లమల అడవుల్లో కృష్ణానదికి ఇరువైపుల ఉండే కొండ, లోయ ప్రాంతాల్లో నివసించే చెంచులను అడవిచెంచులు లేదా కొండచెంచులు అని పిలుస్తారు.
ఊర చెంచులు అనేవారు గ్రామాల్లో తిరుగుతూ… ఏరాటన చేస్తారు. వీరినే కృష్ణ చెంచులు లేక చెంచు దాసరులు అంటారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
ఆధునిక కాలంలో అడవిచెంచులు, ఊర చెంచులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా అడవుల్లో నివసించేవారి పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే వుంది.
అయితే అడవి చెంచులు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తారు. బక్కపలచగా, పొట్టిగా, చెదిరిన ఉంగరాల జట్టు, అమాయకపు ముఖం, సప్పిడి ముక్కు, నలుపు లేక రాగిడంగు చర్యంతో ప్రస్పుటమైన ఆకారంలో చెంచులు వుంటారు.
వీరి కుటుంబ వ్యవస్థ కూడా వీరి జీవనానికి అనుగుణంగా వుంటుంది. ఎప్పుడూ అడవిలో సందరిస్తూ అటవీ ఫలసేకరణ, చిన్న జంతువుల వేట లాంటి పనులు వీరి జీవన విధానంలో భాగాలు కాబట్టి వీరివి చిన్న కుటుంబాలని చెప్పవచ్చు. భార్యాభర్తలు, చిన్నపిల్లలు, సాయంగా కుక్కతో సంచరిస్కుంటారు.
ప్రతి ఏటా ఆగస్టు 9న
ప్రపంచవ్యాప్తంగా ఆదిమ జాతులు అంతరించిపోకుండా సంరక్షించాలన్న తలంపుతో ఐక్యరాజ్యసమితి 1984లో ఆగస్టు 9వ తేదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది.
ఇందులో భాగంగా 1997లో గిరిజనులకు ప్రత్యేర చట్టాలు, హక్కులను ప్రసాదించేందుకు ప్రపంచదేశాల ప్రతినిధులతో తీర్మా నానికి ఆహ్వానించింది.
సుమారు 143 ఐరాస సభ్యదేశాలు ఈ ఓటింగ్లో పాల్గొనగా 125 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి గిరిజనుల హక్కులు,
వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా ఆగస్టు 3వ తేదిన అంతర్జా తీయ ఆదివాసీ దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది..
ప్రపంచవ్యాప్తంగా ఆదిమ జాతులు అంతరించిపోకుండా సంరక్షించాలన్న తలంపుతో ఐక్యరాజ్యసమితి 1984లో ఆగస్టు 9వ తేదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది.
ఇందులో భాగంగా 1997లో గిరిజనులకు ప్రత్యేర చట్టాలు, హక్కులను ప్రసాదించేందుకు ప్రపంచదేశాల ప్రతినిధులతో తీర్మా నానికి ఆహ్వానించింది.
సుమారు 143 ఐరాస సభ్యదేశాలు ఈ ఓటింగ్లో పాల్గొనగా 125 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి గిరిజనుల హక్కులు,
వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా ఆగస్టు 3వ తేదిన అంతర్జా తీయ ఆదివాసీ దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది..
వైవిధ్యం.. చెంచుల జీవితం..!
- నల్లమల పుణ్యక్షేత్రాల్లో చెంచుల మూలాలు
- పాల్కురికి సోమనాథుడి
రచనల్లో ప్రస్థావన
నల్లమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చెంచుల మూలాలు
చెంచుల ఆచారాలు చాలా సరళంగా ఉంటాయి. మైసమ్మ, యాదమ్మ, గురవయ్యలను వారు పూజించేవారు. నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఆహోబిలం దేవాలయాల స్థలపురాణాల్లో చెంచుల గురించి ఎన్నో వివరాలు ప్రస్తావించబడ్డాయి.
శ్రీశైల మల్లికార్జునుడి అసలు పేరు
శ్రీశైలంలోని మల్లికార్జునుడి అసలు పేరు మల్లన్న మల అంటే కొండ, అన్న అనేది పెద్దలను గౌరవంగా పిలవడానికి వాడే పదం, అంటే కొండ మీద ఉన్న అన్న అని అర్థం. అందుకే చెందు మల్లన్న్న మొట్టమొదటి దేవుడుగా విశ్వసిస్తారు.
మల్లన్నను సంస్కృతీకరించిన రూపమే మల్లికార్జునుడు అని అంటారు. శ్రీశైలంలో ఉన్న వృద్ద మల్లికార్జునుడే చెంచు మల్లన్న అని కొందరి నమ్మరం. అతడి రూపం చెంచు దేవతల్లాగే ఒక రాయి ఆకారంలో వుంటుంది. తొలుత చెంచులే శ్రీశైలంలో పూజారులుగా ఉండేవారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
అయితే కాలక్రమంలో మల్లికార్జునుడి ఆలయంలో శైవపూజారులు, భ్రమరాంబ దేవాలయంలో వైష్ణవ పూజారులు వచ్చి. చెంచులను బయటికి పంపారని ప్రచారంలో వుంది. ఆ తర్వాత శ్రీశైలంలో జరిగే ఉత్సవాల్లో రధాన్ని లాగడం, దివిటీలు మోయ్యడం, శివుడి పూజలో ఉపయోగించే మారేడు ఆకులను తీసుకురావడం వంటి పనులకు చెంచులను ఉపయోగించేవారని తెలిసింది.
శ్రీశైలంకు రోడ్డు లేని రోజుల్లో భక్తులు అడవి మార్గంలో వస్తున్నప్పుడు చెంచులే వారికి సహాయపడేవారని బ్రిటీష్ రికార్డుల్లో ఉంది, నేటికి శ్రీశైలంలో చెంచు సంప్రదాయాలతో సంక్రాంతి పర్వదినం రోజున మల్లన్నకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
అహోబిలం క్షేత్ర చరిత్రలో కూడా చెంచుల ప్రస్తావన వుంది. హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్రనరసింహుడు ఇంకా ఉద్రేకంతో ఊగిపోతూ ఆడవిలో సంచరిస్తుంటే లక్ష్మీదేవి చెంచిత రూపంలో వచ్చి అతడిని శాంతిపజేసిందని ఒక విశ్వాసం, తొలుత అహోబిలంలో కూడా అర్చకులుగా చెంచులే వ్యవహరించేవారని అంటారు. చెంచు జాతి ప్రస్తావన పాట్కురికి సోమనాడుడు రాసిన పండితారాధ్య చరిత్రలో కనిపిస్తుంది. చెంచులను ధర్మాత్ములని ఆయన పేర్కొన్నారు.