నల్లమల అడవుల్లో ప్రత్యక్షమైన అడవి దున్న- Adavi Dunna

Adavidunna in Nallamala forest

Adavidunna in Nallamala forest

అనుకోని అతిథి నల్లమలకు చేరింది.

జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్ లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడే అడ వుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం (అడవి దున్న) తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.

నల్లమల అడవుల్లో ప్రత్యక్షమైన అడవి దున్న

పూర్వమే అదృశ్యమైన వీటిని పాపికొండల నుంచి నల్లమలకు రప్పించాలని ప్రణాళిక

అప్రయత్నంగానే సాకారమైన అటవీ శాఖ అధికారుల స్వప్నం

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ : నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమ లలో తిరిగి కనిపించడం ఆటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ..

నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్ లలో కనిపించింది.

ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న.

వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే..

నెల క్రితమే కనిపించినా..

నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్ లోని బైర్లూటి రేంజ్ తలమడుగు ఆటవీ ప్రాంతం లో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది.

వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విష యాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు.

ఆ తరువాత ఇదే అటవీ డివిజన్లోని వెలుగోడు రేంజ్ లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమ లలో తన ఉనికిని చాటింది.

అప్రయత్నంగానే సాకారం

ఒకప్పుడు సల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్య మైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొ చ్చేందుకు ఆటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్లూడ బ్ల్యూఎఫ్) సంస్థ సహకారం అందించేందుకు ముందు కొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్..

ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి. విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. బటవీ అధికా రులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న..

సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ అవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

నల్లమలలో అడవి. దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా బావిస్తున్నారు

ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు

ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తిం చారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే.. కానీ…. అసాధ్యమైనదేమీ కాదు.

పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తర లివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా..

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు ఆటవీ ప్రాంతం
నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top