బీసీ జనార్దన్ రెడ్డి కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత బనగానపల్లెకు విచ్చేస్తున్న సందర్భంగా బనగానపల్లె మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణరెడ్డి,సంగు శంకేశ్వర రెడ్డి, బండి మలీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర బీసీ జనార్దన్ రెడ్డి స్వగృహం వరకు పూల వర్షంతో బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గం 40 ఏళ్ల చరిత్రలో ఎవరికి రాని మంత్రి పదవి బీసీ జనార్దన్ రెడ్డికే దక్కిందని ప్రతిపక్ష నాయకుడిగా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించి నేడు మంత్రి పదవి రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భూషన్న, రాం శేఖర్,సురేంద్ర రెడ్డి, వెంబి రెడ్డి లక్ష్మికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు