- ఇరిగేషన్ రిటైర్డు ఇంజనీర్ సుబ్బారాయుడు మృతికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి ఘన నివాళి
- సుబ్బారాయుడు రాయలసీమకు చేసిన మేలు మరువలేనిది.
ఎడారి లాంటి రాయలసీమకు చుక్క నీరు అందినా బ్రతుకుతాం అన్న ఆశతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే రాయలసీమ ఉద్యమకారులకు తనున్నానని భరోసా ఇస్తూ, ఉద్యమకారులకు సలహాలు, సూచనలు ఇస్తూ నిజమైన రాయలసీమ బిడ్డగా ఇరిగేషన్ ఇంజనీర్ సుబ్బారాయుడు నిలిచారని, ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి తీరనిలోటని, ఆయన ఆశయం సాధించేందుకు ప్రతి రాయలసీమ ఉద్యమబిడ్డ పనిచేస్తారని రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
బుధవారం కర్నూలులో మృతి చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ సుబ్బారాయుడు పార్థివదేహంకు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ పేదరికి నిర్ములన, రైతుకు నీరు అందిస్తే తను బ్రతుకుతూ దేశానికి అన్నం పెడతాడన్నా నమ్మకం సుబ్బారాయుడు ఆలోచన అన్నారు. రాయలసీమలోని అనేక సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వంతో కలిసి సుబ్బారాయుడు రూపాకల్పన చేశారాని, కొన్ని సాధించినా మరికొన్ని ప్రభుత్వం వద్ద ప్రతిపాధనలలోనే ఉన్నాయని వాటిని సాధించి సుబ్బారాయుడుకు అంకితం ఇస్తామని, సిద్దేశ్వరం వద్ద కృష్ణానది పై ఐ కానిక్ బ్రిడ్జి ( తీగల వంతెన ) బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం సుబ్బారాయుడు ఆశయం అని వాటిని సాధించేందుకు రాయలసీమ ఉద్యమకారులుగా ముందుంటామని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు ఇస్తే బ్రతుకుతారు అని పాలకులకు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియమకాలు సాధించి కరువును శాశ్వతంగా తరిమిన నాడే ఇంజనీర్ సుబ్బారాయుడుకు నిజమైన నివాళి అని బైరెడ్డి అన్నారు. రాయలసీమ ఉద్యమనాయుడు సీమ కృష్ణ, వేముల శ్రీధర్ శెట్టి తదితరులు ఉన్నారు.