బైక్ దొంగలు అరెస్ట్

Baik dongalu arest

Baik dongalu arest

*ద్విచక్ర వాహనాల దొంగల గ్యాంగ్ అరెస్టు**పది ద్విచక్ర వాహనాలు ఒక కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ స్వాధీనం**దొంగలించిన వాహనాలు కొనుగోలు చేసిన తాకట్టు పెట్టుకున్న వారిపై కూడా కేసులు నమోదు**గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు,గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్*మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులను మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు ఛేదించారు. బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైక్ చోరీలు చేసిన నిందితుల వివరాలను గ్రామీణ సిఐవై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు వెల్లడించారు. దొంగలించిన పది బైకులను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు, వీరిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు. వారందరినీ గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసిన వాహనాల్లో ఒక కేటిఎమ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఉండటం విశేషం. దొంగల గ్యాంగ్‌లో ప్రధాన నిందితులు లేళ్ల పవన్ తేజ @ క్రాంతి తేజ @ పవన్, తేజావత్ ప్రకాష్, పెడల అంకమ్మరాజు @ రాజు, ఇసుకుపల్లి కీర్తి దాసు కాగా, వీరితో పాటు తుళ్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలురు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు లేళ్ల పవన్ తేజ తుళ్లూరులోని టిడ్కో గృహాలలో నివసిస్తూ మిత్రులతో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు. రౌడీ షీటర్‌గా గుర్తింపు పొందిన ఇసుకుపల్లి కీర్తి రాజు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసి రిసీవర్‌గా వ్యవహరించాడని పోలీసులు వెల్లడించారు….ఫిర్యాదుదారు నవులూరు గ్రామానికి చెందిన మర్రి దుర్గ నాగ మల్లేశ్వరరావు ఇంటి ముందు పార్క్ చేసిన కేటిఎమ్ బైక్‌ను ఆగస్టు 22వ తేదీ రాత్రి దొంగలు అపహరించడంతో కేసు నమోదు అయ్యింది. విచారణలో బయటపడ్డ వివరాల ప్రకారం, నిందితులు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిళ్లను దొంగిలించి నంబర్ ప్లేట్ మార్చి వాడుకోవడం, అమ్మేయడం లేదా తాకట్టు పెట్టడం చేసేవారని తెలిసింది. మంగళగిరి మండలంలోని ఆత్మకూరు, నవులూరు, నిడమర్రు, చినకాకాని, ఎర్రబాలెం గ్రామాల్లో తాళం వేసి ఉన్న వాహనాలను ఎంచుకొని దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దొంగలించిన వాహనాలను కొనుగోలు చేసిన వారు, తాకట్టు పెట్టుకున్న వారిపైనా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిఐవై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో మంగళగిరి రూరల్ హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, ఏఎస్‌ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుల్ రాము, హెడ్ కానిస్టేబుల్ చలమురావు, కానిస్టేబుల్ సాగర్ దర్యాప్తులో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top